ETV Bharat / state

ఒక్క చేప రూ. 2 లక్షలు - పులస కూడా కాదండీ.. ఆయ్! - 2 KACHIDI FISH COST 4 LAKH RUPEES - 2 KACHIDI FISH COST 4 LAKH RUPEES

2 Kachidi Fish Cost 4 Lakh Rupees : కేజీకి కాస్త ఎక్కువగా బరువున్న చేప మహా అయితే ఎంత ధర పలుకుతుంది? పులస చేప అయినా కూడా వందలు దాటి వేలు పలుకుతుంది. కానీ.. ఇక్కడ ఓ చేప లక్షలు పలికింది! అవును.. మరి దాని స్పెషాలిటీ ఏంటో మీరూ చూడండి!

2 Kachidi Fish Cost 4 Lakh Rupees
2 Kachidi Fish Cost 4 Lakh Rupees
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 10:51 AM IST

2 Kachidi Fish Cost 4 Lakh Rupees in Andhra Pradesh : జాలర్లకు ఒక్కోసారి ఎంత కష్టపడినా తగిన ప్రతిఫలం దక్కదు.. ఒక్కోసారి ఊహించని విధంగా అద్భుతం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా మత్స్యకారుల విషయంలో ఇలాంటి అద్భుతమే తాజాగా జరిగింది. అవును మరి.. ఒక్క చేప మహా అయితే వందలు.. ఇంకా ఎక్కువైతే వేల రూపాయలు ఉంటుంది. కానీ.. ఇక్కడ మనం చూస్తున్న చేప మాత్రం అక్షరాలా లక్ష రూపాయలు పలికింది!

సహజంగా పులస చేపలు ఎక్కువగా ధర పలుకుతాయని అందరికీ తెలుసు. వాటికి ఉండే ప్రత్యేకమైన రుచి.. మాంసాహార ప్రియులను అంతగా ఆకర్షిస్తుంది. అందుకే.. వేల రూపాయలు ఖర్చు చేసి మరీ వాటిని కొనుగోలు చేస్తారు. కానీ.. ఈ చేపలు వేరే. వీటిని కచ్చిడీ చేపలు అంటారు. వీటికి ఎవ్వరూ ఊహించని రీతిలో ధర పలికింది. ఈ రెండు చేపలకు ఏకంగా 2 లక్షల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశాడో వ్యక్తి.

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో..

అంతర్వేది సముద్ర తీరంలో చేపలు పడుతున్న మత్స్యకారులకు ఈ రెండు కచ్చిడీ చేపలు చిక్కాయి. సముద్రం నుంచి వీటిని బయటకు తెచ్చిన జాలరులు.. వాటిని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ లో శనివారం వేలం వేశారు. ఈ వేలంలో ఈ రెండు చేపలను దక్కించుకునేందుకు చాలా మంది పోటీపడ్డారు. వారంతా సాధారణ జనం కాదు.. అందరూ వ్యాపారులే. మరి ఇంతగా పోటీ పడి కొనుగోలు చేయడానికి కారణం ఏమంటారా? స్పెషల్ రీజనే ఉంది!

అంత స్పెషల్ ఏంటో..?

ఈ కచ్చడీ చేపలు చాలా అరుదుగా మాత్రమే జాలర్లకు చిక్కుతుంటాయి. సముద్రపు అడుగు భాగంలో ఎక్కువగా సంచరిస్తుంటాయి. అయితే.. వీటిని కొనుగోలు చేసే వారు తినడానికన్నా.. వాటితో వ్యాపారం చేయడానికే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఈ చేపల పొట్టలో తెల్లటి బ్లాడర్ (మావ్) ఉంటుంది. ఇది అత్యంత విలువైనది. దీన్ని జనాలు మింగే మందుల్లో వినియోగిస్తారట. పలు మాత్రలకు పైపూతలా ఈ బ్లాడర్​ను వినియోగిస్తారట. అంతేకాదు.. మనుషులకు వైద్యులు ఆపరేషన్​ చేసిన తర్వాత కుట్లు వేసే దారం తయారీలోనూ ఈ కచ్చడీ చేప బ్లాడర్​ వాడుతారట. అందుకే.. ఈ చేపలకు ఇంత విలువ ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.

2 చేపలు.. 4 లక్షలు..

వేలంలో పోటీ పడిన ఓ వ్యాపారి ఈ రెండు చేపలను 4 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. చూశారుగా.. ఇదీ కచ్చడీ చేపల కెపాసిటీ. రెండు చేపలు వలకు చిక్కాయి కాబట్టి 4 లక్షలు వచ్చాయి. అదే.. ఓ 20, 30 చిక్కి ఉంటే ఎలా ఉండేదో కదా! జాలర్లు దెబ్బకు లక్షాధికారులైపోదురు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.