11 Students Suffered Food Poison in Narsapur KGBV School : నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లోని కేజీబీవీ పాఠశాలలో భోజనం వికటించి 11 మంది విద్యార్థినులు అస్వస్థతతకు గురయ్యరు. విద్యార్థినులు కడుపు నొప్పితో బాధపడటంతో చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు బాలికలకు నొప్పి తీవ్రమవడంతో నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 15 రోజుల క్రితం ఇదే పాఠశాలలో భోజనం వికటించి 25 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘటన మరువక ముందే మరోసారి విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
"కస్తుర్భా పాఠశాలలో సాయంత్రం భోజనం తరువాత 11మంది విద్యార్థినులకు కడుపునొప్పి వచ్చింది. వారిని నర్సాపూర్‌లో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాం. అందులో ముగ్గురికి కడుపు నొప్పి ఎక్కవ ఉండడంతో వారికి ప్రాథామిక చికిత్స తరువాత నిర్మల్ ఆసుపత్రికి తీసుకువచ్చాం. వారికి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది కానీ వారికి కడుపు నొప్పి ఒకటే ఎక్కువగా ఉంది. వైద్యులు వారికి ఇంకా చికిత్స అందిస్తున్నారు." - రవీందర్ రెడ్డి, డీఈవో
Food Poison in Nagarkurnool : కలుషిత ఆహారం కలకలం.. 40 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత
కాగా కొద్ది రోజుల క్రితమే ఇలాంటి జరిగిన ఘటన మరవకముందే మళ్లీ జరగడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చదువుల కోసం తల్లిదండ్రులను వదిలి వచ్చి చదువుకుంటుంటే కనీస సౌకర్యాలు లేవని వాపోయారు. వాళ్లందించే భోజనం ఎలాగూ కడుపు నిండా తినలేమని, కాస్తో కూస్తో తిన్న ఆ ఆహారం కూడా ఇలా తరచూ వికటిస్తూ తమ ఆరోగ్యాన్ని పాడు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డీఈవోకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు.
దీనిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఇటీవలే భువనగిరి గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం తిని చనిపోయిన ప్రశాంత్ ఉదంతాన్ని మరవక ముందే మరో ఫుడ్ పాయిజన్ ఉదంతం వెలుగులోకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ గురుకులాల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరికి ఈ ఉదంతాలు అద్దం పడుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే బాధిత విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Student Dies Due to Food Poison in Bhuvangiri : ఇటీవల భువనగిరి సాంఘీక సంక్షేమ పాఠశాల వసతి గృహంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులలో ప్రశాంత్ అనే విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జిల్లాకు చెందిన పోచంపల్లి మండలం జిబ్లిక్‌పల్లికి చెందిన మహేష్ కుమారుడు ప్రశాంత్ ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 12 న కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు కావడంతో సిబ్బంది విద్యార్థులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. దీనిలో ప్రశాంత్ అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బాలికల వసతి హాస్టల్లో కలుషిత ఆహారం కలకలం.. 20 మందికి తీవ్ర అస్వస్థత
ప్రభుత్వ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ - 16 మందికి విద్యార్థినులకు అస్వస్థత