ETV Bharat / sports

చాహల్​ భార్యను ట్రోల్​ చేస్తున్న నెటిజన్లు - ఆమెను అలా అనుకున్నారుగా! - Yuzvendra Chahal Wife - YUZVENDRA CHAHAL WIFE

Yuzvendra Chahal Wife : టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తనకు అస్సులు సంబంధం లేని ఓ వీడియోను చూసి తనను తిడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది.

Yuzvendra Chahal Wife
Yuzvendra Chahal Wife
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 10:44 AM IST

Yuzvendra Chahal Wife : టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె, తనకు అస్సులు సంబంధం లేని వీడియో కారణంగా ట్రోలింగ్‌కు గురవడానికి కారణమేంటో తెలుసుకుందాం.

కొరియోగ్రాఫర్ సుర్భీ చందన ఇటీవలే పెళ్లి చేసుకుని కరణ్ ఆర్ శర్మతో కలిసి గడుపుతున్న మూమెంట్స్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఒక స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సుర్బీ చందన వీడియో వైరల్ అవడానికి చాహల్ భార్య ధనశ్రీ వర్మను ట్రోలింగ్ చేయడానికి వెనక పెద్ద కథే ఉంది.

చాలా మంది సోషల్ మీడియా యూజర్లు సుర్బీ చందనను చూసి చాహల్ భార్య ధనశ్రీవర్మ అనుకున్నారు. 'భర్తతో కాకుండా వేరే వ్యక్తితో కలిసి స్విమ్మింగ్ పూల్​లో ఎంజాయ్ చేస్తున్నావా?' అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. కొద్ది వారాల క్రితం కొరియోగ్రాఫర్ అయిన ప్రతీక్ ఉటేకర్‌తో కలిసి దిగిన ఫొటో కూడా అంతే వైరల్ అయి ట్రోలింగ్‌కు గురైంది. ఆ ఫొటోను వెంటనే డిలీట్ చేసింది ధనశ్రీ.

ఆ సందర్భంలోనే, "నేను నార్మల్‌గా ట్రోల్స్‌ను పట్టించుకోను. కాకపోతే అవి హద్దుమీరి నా కుటుంబ సభ్యులను, నా సన్నిహితులను ప్రభావితం చేస్తున్నాయి. ఇతరుల వ్యక్తిగత, మనోభావాలను సైతం పట్టించుకోకుండా విమర్శించే హక్కు మీకెక్కడిది? విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారా" అని అంటూ నెటిజన్లను నిలదీసింది ధనశ్రీ.

చాహల్ - ధనశ్రీ వివాహం జరిగి మూడేళ్లు కావొస్తుంది. లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్ డ్యాన్స్ క్లాసులు నేర్చుకుంటున్న సమయంలోనే కొరియోగ్రాఫర్ ధనశ్రీతో చాహల్ ప్రేమలో పడ్డాడు. అలా డిసెంబర్ 2020లో ఇరు కుటుంబాల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.

ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రీసెంట్‌గా 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ గా రికార్డులకెక్కాడు. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2024లోని 38వ మ్యాచ్‌లో ఈ మైలురాయిని సాధించాడు. మహ్మద్ నబీ (23) వికెట్ సాధించడంతో ఈ ఫీట్ పూర్తయింది. 2013లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగ్రేటం చేసిన చాహల్ ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడాడు.

డెంటిస్ట్ టు ప్రొఫెషనల్ డ్యాన్సర్- క్రికెటర్ భార్యకు కోట్లలో 'యూట్యూబ్' లాభాలు!

కోహ్లీకి డ్యాన్స్​ నేర్పిన చాహల్ భార్య ధనశ్రీ.. వీడియో ఇదిగో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.