ETV Bharat / sports

యశస్వి రికార్డుల మోత- సెహ్వాగ్​ను దాటి, గావస్కర్ సరసన జైశ్వాల్ - yashasvi test career

Yashasvi Jaiswal Test Record: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ఇంగ్లాండ్​ సిరీస్​లో పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్​తో నాలుగో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్​లో హాఫ్ సెంచరీ సాధించిన యశస్వి గావస్కర్, ద్రవిడ్​లాంటి దిగ్గజాల సరసన నిలిచాడు.

Yashasvi Jaiswal Test Record
Yashasvi Jaiswal Test Record
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 5:38 PM IST

Yashasvi Jaiswal Test Record: ఇంగ్లాండ్​తో జరగుతున్న టెస్టు సిరీస్​లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్​లో రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసిన యశస్వి, నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో మరో హాఫ్ సెంచరీతో (73 పరుగులు) రాణించాడు. ఈ క్రమంలో టెస్టు కెరీర్​లో ఓ అరుదైన ఘనత సాధించాడు.

ప్రస్తుత సిరీస్​లో యశస్వి ఇప్పటికే 7 ఇన్నింగ్స్​ల్లో 618 పరుగులు బాదాడు. ఈ క్రమంలో ఓ టెస్టు సిరీస్​లో 600+ పరుగులు నమోదు చేసిన ఐదో బ్యాటర్​గా రికార్డు కొట్టాడు. ఇదివరకు టీమ్ఇండియాలో దిలీప్‌ సర్దేశాయ్‌, సునీల్‌ గావస్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, విరాట్‌ కోహ్లీ ఈ ఘనత అందుకున్నారు. కాగా, గావస్కర్‌, విరాట్ తమ కెరీర్​లో రెండుసార్లు ఈ ఫీట్ సాధించారు.

1970- 71లో వెస్టిండీస్​తో జరిగిన టెస్టు సిరీస్​లో దిలీప్‌ సర్దేశాయ్‌, సునీల్‌ గావస్కర్‌ (774 పరుగులు) ఈ ఘనత అందుకున్నారు. ఇక 1978- 79లో మళ్లీ విండీస్​పైనే గావస్కర్ 732 పరుగులు చేశాడు. టెస్టు సిరీస్​లో భారత్ తరఫున 700+ పరుగులు చేసిన బ్యాటర్ గావస్కరే. ఇక టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ సిరీస్​లో అత్యధిక పరుగుల బాదిన రికార్డ్​ ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ డొనాల్ట్ బ్రాడ్​మన్ (974 పరుగులు) పేరిట ఉంది. అతడు ఇంగ్లాండ్​తో జరిగిన 5 మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో ఈ రికార్డు నెలకొల్పాడు.

ఇక ఇదే సిరీస్​లో యశస్వి మరో రికార్డు సాధించాడు. ప్రస్తుత సిరీస్​లో జైశ్వాల్ 23 సిక్స్​లు బాదాడు. ఈ నేపథ్యంలో ఓ క్యాలెండర్ ఇయర్​లో టెస్టుల్లో అత్యధిక సిక్స్​లు బాదిన టీమ్ఇండియా బ్యాటర్​గా నిలిచాడు. ఇదివరకు ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ (22) పేరిట ఉండేది. నాలుగో టెస్టులో ఓ సిక్స్​ బాదిన యశస్వి సెహ్వాగ్ రికార్డ్ బద్దలుకొట్టాడు. ఇక ఓవరాల్​గా యశస్వి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్ట్​లో న్యూజిలాండ్ బ్యాటర్ బ్రెండన్​ మెక్​కల్లమ్ (33 సిక్స్​లు 2014లో), ఇంగ్లాండ్ కెప్టెన్ (26 సిక్స్​లు 2022లో) ముందున్నారు. ఇక ఈ సిరీస్​లో మరే ఇతర బ్యాటర్ 300 పరుగులు కూడా నమోదు చేయలేదు

ముంబయిలో 5 గదుల అపార్ట్​మెంట్​ - యశస్వి నెట్ వర్త్ ఎంతంటే ?

యశస్వి డబుల్ సెంచరీ: రైనాను గుర్తుచేసిన సర్ఫరాజ్- వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.