ETV Bharat / sports

ముంబయిలో 5 గదుల అపార్ట్​మెంట్​ - యశస్వి నెట్ వర్త్ ఎంతంటే ? - యశస్వీ జైస్వాల్ కెరీర్

Yashasvi Jaiswal Net Worth : టీమ్ఇండియా నయా సంచలనం యశస్వి జైశ్వాల్ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. రాజ్​కోట్ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టెస్టులో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. అలా 147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఈ ఘనతను సాధించిన ఏకైక ప్లేయర్​గా జైస్వాల్​ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇప్పుడు నెట్టింట ఈ కుర్రాడి గురించే చర్చలు జరుగుతున్నాయి. ఇలా ఎంట్రీ ఇచ్చిన అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్న ఈ స్టార్ ప్లేయర్ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాలు మీ కోసం.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 5:39 PM IST

Yashasvi Jaiswal Net Worth : ఇటీవలే రాజ్​కోట్ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టెస్ట్​ మ్యాచ్​లో టీమ్ఇండియా జట్టు అద్వితీయ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. హోరా హోరీగా జరిగిన పోరులో 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై రోహిత్ సేన భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ గెలుపు వెనక కీలక పాత్ర పోషించింది మాత్రం యూపీకి చెందిన 23 ఏళ్ల యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్.

తాజాగా జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో యశస్వి వీరబాదుడికి ఇంగ్లీష్ ప్లేయర్లు హడలెత్తిపోయారు. అతడు సాధించిన డబుల్ సెంచరీ ఆ మ్యాచ్​కే హైలెట్​గా నిలిచింది. ఇప్పటికే మ్యాచ్ ముగిసి 4 రోజులు అవుతోంది. అయినప్పటికీ నెట్టింట యశస్వి చేసిన సెంచరీ గురించే చర్చలు జరుగుతోంది.

2001 డిసెంబర్ 28న ఉత్తరప్రదేశ్‌లోని భాదోహిలోని సూర్యవాన్‌లో జైస్వాల్ జన్మించాడు. పిన్నవయసులోనేన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ యంగ్ ప్లేయర్ క్రికెట్​లో మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకు ముంబయికి పయనమయ్యాడు. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. అయితే జైస్వాల్​లోని ట్యాలెంట్​ను గుర్తించిన కోచ్ జ్వాలాసింగ్ అతడ్ని ప్రోత్సహించాడు. కొంత కాలానికి యశస్వి అండర్ 19 ఇండియా జట్టులో స్థానాన్ని దక్కించుకున్నాడు. తన పెర్ఫామెన్స్​తో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్​ రాజస్థాన్ రాయల్స్ జట్టు దృష్టిని ఆకర్షించాడు. 2020 వేలంలో ఆ ఫ్రాంచైజీ ఈ యంగ్ ప్లేయర్​ను రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక 2022లోనూ రాజస్థాన్ జట్టు జైస్వాల్​ను రూ. 4 కోట్లకు సొంతం చేసుకుంది.

అయితే 2023లో కోల్​కతా నైట్ రైడర్స్ పై జరిగిన మ్యాచ్​లో జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అందరినీ అబ్బురపరిచాడు. కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ లాంటి స్టార్ ప్లేయర్ల రికార్డును ఈజీగా బద్దలు కొట్టాడు. ఇక ఈ హాఫ్ సెంచరీ యశస్వి కెరీర్​ను కీలక మలుపు తిప్పింది. రాజస్థాన్ జట్టు ఐపీఎల్ టోర్నీలో రాణించకపోయినప్పటికీ జైస్వాల్ మాత్రం ఎప్పటికప్పుడు తన బెస్ట్ ఇస్తూ ఎన్నో రికార్డులను సాధించాడు. ఆ తర్వాత టీమ్ఇండియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా తన సత్తా చాటుతున్నాడు.

యశస్వి నెట్ వర్త్ ఎంతంటే ?
ప్రస్తుతం టీమ్​ఇండియాలో రాణిస్తున్న యశస్వి జైస్వాల్ నికర విలువ రూ. 10.73 కోట్లు అని అంచనా. ఈ యంగ్ క్రికెటర్ ప్రతి నెలా దాదాపు రూ. 35 లక్షలు సంపాదిస్తున్నాడట. ఐపీఎల్ లో ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌తో అతని ఒప్పందం కాకుండా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుంచి ఒక మ్యాచ్‌కు రూ. 35 లక్షలకు మేర సంపాదిస్తున్నాడని సమచారం.

ఇటీవలే థానేలో 5 గదుల ఫ్లాట్​ను కొనుగోలు చేశాడు. 1500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ ఇంటిని మోకాసా స్టూడియో మినిమలిస్టిక్ అనే సంస్థ లెటేస్ట్ టెక్నాలజీతో ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఇంటికి సంబంధించిన ఇంటీరియర్​లో యూరోపియన్ సంస్కృతి ప్రతిబింబించేలా రూపొందించారు. దీంతో పాటు ఓ మెర్సిడేజ్ ఎస్ యూవీ కారుని కూడా జైస్వాల్ కొనుగోలు చేశాడు.

బహు పరాక్‌ - ఆ పోరాట స్ఫూర్తే పరుగుల తపస్విగా మార్చింది!

యశస్వి @ 214- కుర్రాడి వీరబాదుడికి ఇంగ్లీష్ జట్టు హడల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.