ETV Bharat / sports

'నాపై విరాట్ ఎఫెక్ట్- అలా చేశాకే ఇంప్రూవ్ అయ్యా' - YASHASVI JAISWAL INSPIRATION

ఆసీస్ పర్యటనపై జైస్వాల్- తన ఇన్స్​పిరేషన్ విరాటే అంట!

Yashasvi Jaiswal
Yashasvi Jaiswal (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 21, 2024, 4:58 PM IST

Yashasvi Jaiswal Inspiration : యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్‌ అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేసిన కొద్ది రోజుల్లోనే టీమ్ఇండియాలో అత్యంత కీలక ఆటగాడిగా మారాడు. ఈ ఏడాది టెస్టుల్లో వెయ్యికిపైగా స్కోరు సాధించిన ఇద్దరు బ్యాటర్లలో అతడిది రెండో స్థానం. ఫార్మాట్‌ ఏదైనా సరే దూకుడుగా ఆడడమే జైస్వాల్ తత్వం. అయితే ఇలాంటి యువ క్రికెటర్​కు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మార్గదర్శిగా నిలిచాడట.

జాతీయ జట్టులోకి వచ్చిన కొత్తలో విరాట్​తోనే ఎక్కువగా మాట్లాడేవాడినని, అప్పుడు అతడు చెప్పిన మాటలు తనలో చాలా స్ఫూర్తి నింపాయని తాజాగా యశస్వి జైస్వాల్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు తొలిసారి వచ్చిన తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు వెల్లడించాడు. జైస్వాల్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

'సీనియర్ క్రికెట్​లో అడుగుపెట్టిన తర్వాత విరాట్​తో ఒకసారి మాట్లాడాను. మూడు ఫార్మాట్లలో ఇన్నేసి మ్యాచ్‌లు ఆడటాన్ని ఎలా మేనేజ్‌ చేస్తున్నావని అడిగా. దానికి విరాట్ ఇచ్చిన సమాధానం ఎప్పటికీ మరిచిపోలేను. 'నేను మూడు ఫార్మాట్లలో ఆడాలని కోరుకుంటున్నా. అందుకే నా దినచర్య కూడా ఓ పద్ధతిలో ఉండాలి. ఇందులో క్రమశిక్షణ అత్యంత కీలకం' అని అన్నాడు.

అప్పట్నుంచి విరాట్ ఏం చేస్తున్నాడనేది రోజూ చూస్తూ ఉండేవాడిని. అది నాపై ఎంతో ప్రభావం పడిందనిపించేది. నా అలవాట్లలోనూ చాలా మార్పులు వచ్చాయి. నాకు ఎంత అత్యంత ముఖ్యమనే విషయాలను తెలుసుకోగలిగా. రోజు రోజుకూ ఇంప్రూవ్ అవుతూ వచ్చా' అని జైస్వాల్ తెలిపాడు.

తొలి పర్యటన
'నా కెరీర్​లో ఇదే తొలి ఆస్ట్రేలియా ట్రిప్. ఇక్కడ ఆడాలని చాన్నాళ్లుగా ఎదురుచూస్తూ ఉన్నా. నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తా. భారత్‌లోని పరిస్థితులకు, ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. నేను మానసికంగానూ ప్రీపేర్ అయ్యా. 'అక్కడ అలా ఉంటుంది', 'ఆ పిచ్‌లు చాలా కఠినం' అనే మాటలను చాలా విన్నా. ఇప్పుడు ప్రత్యక్షంగా ఆడే ఛాన్స్​ వచ్చింది. ఆ సవాళ్లను ఎదుర్కొంటూనే ఆటను ఆస్వాదిస్తా. ఇక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని నేర్చుకొనేందుకు ప్రయత్నిస్తా' అని యశస్వి పేర్కొన్నాడు.

న్యూజిలాండ్​తో రెండో టెస్టు - దిగ్గజాల రికార్డ్​ సరసన యశస్వి జైశ్వాల్​

యశస్వి అరుదైన ఘనత- తొలి బ్యాటర్​గా రికార్డ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.