Yashasvi Jaiswal England Series : రాజ్‌కోట్ వేదికగా జరగుతున్న మూడో టెస్ట్ ఎంతో ఉత్కంఠంగా సాగుతోంది. శుక్రవారం నాటి ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు స్కోర్ చేసింది. దీంతో శనివారం ఇదే స్కోర్‌కు మ్యాచ్ ఆరంభమైంది. అయితే అప్పటికే దూకుడు మీద ఉన్న ఇంగ్లీష్ జట్టు ప్లేయర్లకు రోహిత్ సేన కళ్లెం వేసింది. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే మన బౌలర్లు మెరుపు వేగంతో రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. దీంతో ఆదిలోనే ప్రత్యర్థలకు షాక్ తగిలింది.
అయితే 40వ ఓవర్ ఐదో బంతికి జో రూట్ వికెట్ మాత్రం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఔట్ సైడ్ ఆఫ్ దిశగా బుమ్రా వేసిన బంతిని రివర్స్ ల్యాప్ షాట్ ఆడేందుకు రూట్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతిని గాల్లోకి లేపాడు. అయితే సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న యశస్వి జైస్వాల్ ఆ బంతిని మెరుపు వేగంతో వచ్చి క్యాచ్ పట్టాడు. అలా బుమ్రా ఖాతాలో ఓ వికెట్ పడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
India Vs Eng Test Day 3 : ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో రోజు ఆట తొలి సెషన్ ముగిసింది. ఇందులో 26 ఓవర్లు వేసిన టీమ్ఇండియా బౌలర్లు 83 పరుగులిచ్చి 3 వికెట్లను పడగొట్టారు. కుల్‌దీప్ యాదవ్ 2, జస్ప్రీత్ బుమ్రాకు ఒక వికెట్ దక్కాయి. ఇక క్రీజ్‌లో ఇంగ్లాండ్ ప్లేయర్లు బెన్‌స్టోక్స్ (39*), బెన్ ఫోక్స్ (6*) ఉన్నారు. ఈ నేపథ్యంలో టార్గెట్‌ను అందుకునేందుకు ఇంగ్లాండ్‌కు ఇంకా 155 పరుగులు కావాల్సి ఉంది. భారత బౌలర్లు పొదుపుగా బంతులు వేస్తున్నప్పటికీ ఇంగ్లాండ్ ప్లేయర్లు దూసుకెళ్తున్నారు. దీంతో మూడో రోజు ఇంగ్లాండ్‌ను వీలైనంత త్వరగా ఆలౌట్ చేస్తేనే భారత్‌కు ఆధిక్యం దక్కుతుందని విశ్లేషకుల మాట. బజ్‌బాల్ ఆటతీరుతో సాగుతున్న ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి దూసుకెళ్తే పరిస్థితులు ప్రతికూలమవుతాయని అంటున్నారు.
మూడో టెస్టు నుంచి వైదొలిగిన అశ్విన్ - తల్లి కోసం చెన్నైకి పయనం