ETV Bharat / sports

'మ్యాచ్​కు రూ.200-300 వచ్చేవి- బ్యాట్ కూడా ఉండేది కాదు' యశస్వి ఎమోషనల్ వీడియో

Yashasvi Jaiswal Emotional Video: విశాఖపట్టణం టెస్టులో టీమ్ఇండియా బ్యాటర్ జైశ్వాల్ భారీ ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో జైశ్వాల్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. మీరు ఆ వీడియో చూశారా?

Yashasvi Jaiswal Emotional Video
Yashasvi Jaiswal Emotional Video
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 8:18 PM IST

Yashasvi Jaiswal Emotional Video: భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్టులో తొలి రోజు టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. స్వదేశంలో టెస్టుల్లో తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. విశాఖపట్టణం పిచ్​పై పరుగులు చేయడానికి టీమ్ఇండియా బ్యాటర్లు కష్టపడుతుంటే, జైశ్వాల్ మాత్రం క్రీజులో ఈజీగా స్కోర్ చేశాడు. తొలి రోజు 257 బంతులు ఎదుర్కొన్న యంగ్ బ్యాటర్ 179 పరుగులు చేశాడు. అందులో 17 ఫోర్లు, 5 సిక్స్​లు ఉన్నాయి. దీంతో మ్యాచ్​లో తొలి రోజు హీరోగా నిలిచాడు. అయితే జైశ్వాల్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. జైశ్వాల్ ఎంతో ఎమోషనల్​గా మాట్లాడుతూ లైఫ్​లో తను పడిన ఇబ్బందుల గురించి వీడియోలో చెప్పాడు.

'నేను కెరీర్​ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఓ సమయంలో ఒంటరిగా ఫీలయ్యా. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఓ లోకల్ మ్యాచ్​లో ఆడే ఛాన్స్ వచ్చింది. అందులో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే రూ.200, రూ.300 వచ్చేవి. ఒక్కోసారి బ్యాట్​ కూడా లేదు. వేరే వాళ్ల కిట్​ తీసుకుని ఆడాల్సి వచ్చేది. ఏదైనా సాధించాలని మైండ్​లో ఫిక్సైతే అస్సలు వదులొద్దు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దానికోసం ప్రయత్నించాలి. ఫలితం గురించి ఆలోచించకూడదు. అది మన చేతుల్లో లేదు. ప్రజెంట్ గురించే ఆలోచించాలి' అని జైశ్వాల్ తన లైఫ్​లో ఎదుర్కొన్న విషయాల గురించి చెప్పాడు. అయితే ఇది పాత వీడియో. జైశ్వాల్ తాజా ఇన్నింగ్స్​తో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

రేపు కూడా ఇలాగే ఆడాలి: జైశ్వాల్ ఇన్నింగ్స్​పై పలువురు మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ జైశ్వాల్ ఆటను ప్రసంశించాడు. 'టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాలో బ్యాటర్లు క్రీజులో సెట్ అవ్వగానే ఔట్ అయ్యారు. గిల్, అయ్యర్ 20-30 పరుగులు చేసినా భారీ ఇన్నింగ్స్​ ఆడడంలో విఫలమయ్యారు. కానీ, జైశ్వాల్ అద్భుతంగా ఆడాడు. అతడు వైట్ అండ్ రెబ్​ బాల్​ క్రికెట్​లో బాగా ఆడాడు. స్పిన్, పేస్ బౌలింగ్​ను సమర్దంగా ఎదుర్కొంటున్నాడు. అతడు రాజస్థాన్ (ఐపీఎల్)లో ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేశా. అతడు నాగ్​పుర్​లో సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. దాని ఫలితమే ఇవాళ్టి ఇన్నింగ్స్​. రేపు కూడా ఇలాగే ఆడాలని కోరుకుంటున్నా' అని కైఫ్ అన్నాడు.

ఫస్ట్​ డే 'యశస్వి'దే- భారీ శతకంతో జైశ్వాల్ అదరహో

'సిరాజ్​ను దానికోసమే పక్కనబెట్టాం' - బీసీసీఐ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.