WPL Auction 2025 : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2025 సీజన్ కోసం బెంగళూరు వేదికగా మినీ వేలం జరిగింది. 19 స్లాట్‌ల కోసం జరిగిన ఈ ఆక్షన్‌లో 120 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. భారత అన్‌క్యాప్‌డ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సిమ్రాన్ షేక్ ఈ వేలంలో అత్యధిక ధర దక్కించుకుంది. సిమ్రాన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.1.90 కోట్లకు దక్కించుకుంది. ఆమె బేస్ ప్రైజ్ రూ.10 లక్షలు కాగా, దిల్లీ, గుజరాత్ ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు గుజరాత్ ఆమెను కొనుగోలు చేసింది.
ఇక వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌లో దిగగా ఆమె కోసం గుజరాత్, యూపీ వారియర్స్ పోటీపడ్డాయి. చివరకు గుజరాత్ జెయింట్స్ రూ.1.70 కోట్లకు డియాండ్రను సొంతం చేసుకుంది. ఇక భారత వికెట్ కీపర్, బ్యాటర్ 16ఏళ్ల జి కమలినీని ముంబయి దక్కించుకుంది. ఆమె కోసం ముంబయి రూ. 1.60 కోట్లు వెచ్చించింది. ప్రేమ రావత్‌ను రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసింది.
#TATAWPLAuction ✅
— Women's Premier League (WPL) (@wplt20) December 15, 2024
Here are the 𝗧𝗼𝗽 𝗕𝘂𝘆𝘀 after an exciting Auction day 😇#TATAWPL pic.twitter.com/FsxTYAAP0R
వేలంలో అమ్ముడైన ప్లేయర్లు
- సిమ్రాన్ షేక్ - రూ 1.90 కోట్లు (గుజరాత్ జెయింట్స్)
- డియాండ్రా డాటిన్ - రూ 1.70 కోట్లు (గుజరాత్ జెయింట్స్)
- జి కమలిని - రూ 1.60 కోట్లు (ముంబయి ఇండియన్స్)
- ప్రేమ రావత్ - రూ 1.20 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- ఎన్ చరణి - రూ. 55 లక్షలు (దిల్లీ క్యాపిటల్స్)
- నాడిన్ డి క్లర్క్ - రూ. 30 లక్షలు (ముంబయి ఇండియన్స్)
- డేనియల్ గిబ్సన్ - రూ. 30 లక్షలు (గుజరాత్ జెయింట్స్)
- అలనా కింగ్ - రూ. 30 లక్షలు (యూపీ వారియర్స్)
- అక్షితా మహేశ్వరి - రూ. 20 లక్షలు (ముంబయి ఇండియన్స్)
- నందిని కశ్యప్ - రూ. 10 లక్షలు (దిల్లీ క్యాపిటల్స్)
- సారా బ్రైస్ - రూ. 10 లక్షలు (దిల్లీ క్యాపిటల్స్)
- జోషిత VJ - రూ. 10 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- సంస్కృతి గుప్తా - రూ. 10 లక్షలు (ముంబయి ఇండియన్స్)
- క్రాంతి గౌడ్ - రూ. 10 లక్షలు (యూపీ వారియర్స్)
- అరుషి గోయెల్ - రూ. 10 లక్షలు (యూపీ వారియర్స్)
- ప్రకాశిక నాయక్ - రూ. 10 లక్షలు (గుజరాత్ జెయింట్స్)
- నికి ప్రసాద్ - రూ. 10 లక్షలు (దిల్లీ క్యాపిటల్స్)
- జాగ్రవి పవార్ - రూ. 10 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- రాఘవి బిస్త్ - రూ. 10 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
అన్‌సోల్డ్ వీళ్లే!
పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా, సుష్మా వర్మ, శుభా సతీశ్‌తోపాటు విదేశీ స్టార్లు హీథర్ నైట్, లిజెల్ లీ, లారెన్ బెల్, సారా గ్లెన్, కిమ్ గార్త్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.
— Women's Premier League (WPL) (@wplt20) December 15, 2024
WPL 2025 రిటెన్షన్- ఆర్సీబీ, ముంబయి స్ట్రాంగ్- ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుందంటే?
కోహ్లీకి ప్రపోజ్ చేసిన మహిళా క్రికెటర్ - జట్టులోకి తీసుకున్న ఆర్సీబీ!