WPL 2024 Play offs : మహిళల ప్రీమియర్ లీగ్ 2024 ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటికే అన్ని జట్లు సగం మ్యాచ్‌ల వరకు ఆడేశాయి. దీంతో ఆయా జట్ల ఆటతీరుపై ఓ అంచనా వచ్చేసినట్టైంది. మరి ఈ అంచనా ఆట తీరు ఆధారంగా ప్లేఆఫ్స్ రేసులో ఎవరు ఉంటారు? ఎవరు ఇంటి ముఖం పడతారో ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. దిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ జెయింట్స్ ఇంకా ఖాతా తెరవక ప్లే ఆఫ్స్ అవకాశాలను కష్టతరం చేసుకుంది.
Delhi Capitals Women : ఈ జట్టు అన్ని విభాగాల్లో బాగానే రాణిస్తోంది. మెగ్ లానింగ్ కెప్టెన్. ఆడిన నాలుగింట్లో మూడు విజయాలు సాధించింది. 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మెరుగైన రన్‌రేట్ కూడా ఉంది. ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఈ జట్టుకు ఎక్కువగా ఉన్నాయి.
-
.@DelhiCapitals registered their third consecutive win powered by a Captain’s knock and a disciplined bowling performance 👏👏 #TATAWPL
— Women's Premier League (WPL) (@wplt20) March 4, 2024
Here’s a roundup of the #DCvGG clash 🎥 pic.twitter.com/wNcfovAWR9
Mumbai Indians Women : డిఫెండింగ్ చాంఫియన్‌గా బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ కూడా మంచి ప్రదర్శనే చేస్తోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించింది. రన్‌రేట్ కాస్త తక్కువ అవ్వడం వల్ల రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇదే ఊపు కొనసాగిస్తే ఈ జట్టు కూడా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం కనిపిస్తోంది.
UP Warriorz : ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలే సాధించింది. ప్లేఆఫ్స్ అర్హత సాధించాలంటే మిగతా మ్యాచ్‌ల్లో గెలవడం కాకుండా ఇతర టీమ్స్ రిజల్ట్స్ తనకు కలిసిరావాలి. అయితే ఈ జట్టుకు రన్‌రేట్ కాస్త ఎక్కువ ఉండటం కలిసొచ్చే అంశం.
Royal Challengers Bangalore Women : వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన ఆర్సీబీ ఆ తర్వాత డీలా పడింది. రెండు వరుస ఓటములను ఖాతాలో వేసుకుని నాలుగో స్థానంలో ఉంది. రన్‌రేట్ కూడా మైనస్. మిగతా మ్యాచుల్లో గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. అలాగే ఇతర టీమ్ రిజల్ట్స్ కూడా దీని ప్లేఆఫ్స్ ఛాన్స్‌లపై ప్రభావం చూపిస్తాయి.
Gujarat Giants : గుజరాత్ గత సీజన్‌లోనూ తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లోనూ ఇలానే చేస్తోంది. ఇప్పటి వరకూ ఆడిన నాలుగింట్లో ఒక్కటి కూడా గెలవలేదు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ కష్టమే. ఈ రేసులో నిలవాలంటే మిగతా 4 మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాయి. అలానే ఇతర జట్ల ఫలితాలు కలిసిరావాలి.
ప్లేఆఫ్స్ ఫార్మాట్ ఎలా సాగుతుందంటే? పాయింట్స్ టేబుల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన టీమ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. టాప్ పొజిషన్లో ఉన్న జట్టు డైరెక్ట్‌గా ఫైనల్ ఆడుతుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన టీమ్స్ ఎలిమినేటర్ మ్యాచులు ఆడతాయి. ఇందులో గెలిచినది ఫైనల్‌లో ఉన్న జట్టుతో తలపడుతుంది. మార్చి 15న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. 17న ఫైనల్ జరగనుంది.
-
Bengaluru gears up for a thrilling encounter 🔥🔥
— Women's Premier League (WPL) (@wplt20) March 4, 2024
The @UPWarriorz take on @RCBTweets with both teams eyeing one final win before moving to Delhi 🙌#TATAWPL | #UPWvRCB pic.twitter.com/LFnmmY7Ljc