ETV Bharat / sports

WPL 2024 ఉత్కంఠ మ్యాచ్​లో ఆర్సీబీపై దిల్లీ విజయం - ప్లేఆఫ్స్​కు అర్హత

WPL 2024 Delhi Capitals VS Royal Challengers : డబ్ల్యూపీఎల్ 2024లో భాగంగా నేడు(మార్చి 10) జరిగిన మ్యాచ్​ ఉత్కంఠగా సాగింది. ఆర్సీబీపై దిల్లీ క్యాపిటల్స్​ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

WPL 2024  ఉత్కంఠ మ్యాచ్​లో ఆర్సీబీపై దిల్లీ విజయం

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 10:50 PM IST

Updated : Mar 10, 2024, 11:07 PM IST

WPL 2024 Delhi Capitals VS Royal Challengers : డబ్ల్యూపీఎల్ 2024లో భాగంగా నేడు(మార్చి 10) జరిగిన మ్యాచ్​ ఉత్కంఠగా సాగింది. ఆర్సీబీపై దిల్లీ క్యాపిటల్స్​ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఆర్సీబీ గెలవడానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో రిచా ఘోష్‌ (29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 51 పరుగులు) రనౌట్‌ కావడం వల్ల దిల్లీ విజయాన్ని ఖాతాలోవేసుకుంది. ఎల్లీస్​ పెర్రీ(32 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్​ సాయంతో 49), సోఫీ మోలినెక్స్‌(30 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 33), సోఫీ డివైన్​(26) పర్వాలేదనిపించే ప్రదర్శన చేశారు. దిల్లీ బౌలర్లలో మారిజానె కాప్‌, ఎలిస్‌ క్యాప్సీ, షిఖా పాండే, అరుంధతీ రెడ్డి తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్​కు దిగిన దిల్లీ క్యాపిటల్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు మెగ్‌ లానింగ్‌ (26 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29), షఫాలీ వర్మ (18 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 23) ఫర్వాలేదనిపించారు. జెమీమా రోడ్రిగ్స్‌ (36 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 58) హాఫ్​ సెంచరీ బాదింది. అలీస్‌ క్యాప్సీ (32 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 48) కొద్దిగలో అర్ధ శతకం చేజార్చుకుంది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయంకా పాటిల్ నాలుగు వికెట్లతో మెరిసింది. శోభన ఒక వికెట్ తీసింది.

WPL 2024 Points Table : ఈ మ్యాచ్‌ విజయంతో దిల్లీ క్యాపిటల్స్​ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ సీజన్​లో ముంబయి తర్వాత ప్లే ఆఫ్స్​కు(WPL Delhi Play Offs) అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. ఆర్సీబీ ఓడి తమ ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.

అదరగొట్టిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీ - ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం

ఐపీఎల్ 2024 - పంత్​ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్​!

Last Updated : Mar 10, 2024, 11:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.