Shafali Verma 200: టీమ్ఇండియా మహిళల జట్టు యంగ్ బ్యాటర్ షఫాలీ వర్మ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. చెన్నై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో మహిళల క్రికెట్లోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించింది. షఫాలీ 194 బంతుల్లోనే 200 మార్క్ అందుకుంది. ఈ క్రమంలో ఆసీస్ బ్యాటర్ అనబెల్ (248 బంతుల్లో) రికార్డ్‌ను షఫాలీ బ్రేక్ చేసింది.
కాగా, టీమ్ఇండియా నుంచి టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచింది. 2002లో అప్పటి భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ మార్క్ అందుకుంది. అంటే దాదాపు 22ఏళ్ల తర్వాత మహిళల క్రికెట్లో టీమ్ఇండియా బ్యాటర్ డబుల్ సాధించింది. ఇక షఫాలీ ఓవరాల్‌గా ఉమెన్స్ క్రికెట్లో టెస్టు డబుల్ సెంచరీ సాధించిన 10వ బ్యాటర్‌గా నిలిచింది.
DOUBLE HUNDRED!
— BCCI Women (@BCCIWomen) June 28, 2024
Take a bow @TheShafaliVerma 🫡
This has been a splendid knock from the opener!
Follow the match ▶️ https://t.co/4EU1Kp6YTG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/1oCHuIxSdF
స్మృతి జస్ట్ మిస్
ఈ మ్యాచ్‌లో మరో ఓపెనర్ స్మృతి మంధాన కూడా రఫ్పాడించింది. షఫాలీతో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించింది. ఈ మ్యాచ్‌లో మంధాన 149 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఒక్క పరుగు తేడాతో కెరీర్లో తొలి 150 మిస్ చేసుకుంది. వీరిద్దరు తొలి వికెట్‌కు 292 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు. ఇది మహిళల టెస్టు క్రికెట్లో అత్యధిక తొలి వికెట్ పార్ట్నర్షిప్.
🚨 Milestone Alert 🚨
— BCCI Women (@BCCIWomen) June 28, 2024
2⃣9⃣2⃣
This is now the highest opening partnership ever in women's Tests 🙌
Smriti Mandhana & Shafali Verma 🫡🫡
Follow the match ▶️ https://t.co/4EU1Kp7wJe#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @mandhana_smriti | @TheShafaliVerma pic.twitter.com/XmXbU9V3M6
ఇక మ్యాచ్విషయానికొస్తే, తొలి రోజు ఆట ముగిసేసరికి టీమ్ఇండియా 525-4 భారీ స్కోర్ చేసింది. క్రీజులో హర్మన్‌ప్రీత్ సింగ్ (42 పరుగులు), రిచా ఘోష్ (43 పరుగులు) ఉన్నారు. ఓపెనర్లు షఫాలీ వర్మ (205), స్మృతి మంధాన (149), జెమీమా రోడ్రిగ్స్ (55 పరుగులు) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో దెల్మి టక్కర్ 2, డి క్లర్క్ 1 వికెట్ పడగొట్టారు.
అందులోనూ రికార్డే మహిళల టెస్టులో ఒక రోజులో అత్యధిక పరుగులు చేసిన జట్టుగానూ టీమ్ఇండియా రికార్డు సృష్టించింది. 2002లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక (509-9 స్కోర్) రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి రోజే 525 పరుగులు చేసింది.
HISTORY CREATED BY SHAFALI VERMA.
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 28, 2024
- The fastest to score a double century in women's Test match. 🫡🇮🇳pic.twitter.com/FVa4DTa8dO
2024 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్- భారత్ x పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? - Asia Cup 2024 Schedule