ETV Bharat / sports

రెస్ట్ కాదు - సిరాజ్​ను రెండో టెస్ట్​లో తీసుకోకపోవడానికి అసలు కారణమిదే! - MOHAMMED SIRAJ IND VS NZ 2ND TEST

న్యూజిలాండ్​తో జరుగుతోన్న రెండో టెస్ట్​లో సిరాజ్​ను ఎందుకు తీసుకోలేదంటే?

IND vs NZ 2nd Test Mohammed Siraj
IND vs NZ 2nd Test Mohammed Siraj (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 24, 2024, 12:21 PM IST

IND vs NZ 2nd Test Mohammed Siraj : పుణె వేదికగా న్యూజిలాండ్​తో రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్​లో మూడు మార్పులతో బరిలోకి దిగింది టీమ్ ఇండియా. కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్‌లు తుది జట్టులో చోటు కోల్పోగా, వారి స్థానాల్లో శుభ్‌మన్ గిల్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు.

అయితే ఈ పోరులో సిరాజ్‌ను తప్పించడానికి విశ్రాంతి కారణం కాదని ఇంగ్లీష్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. గత కొంతకాలంగా స్వదేశంలో జరిగే టెస్టుల్లో ఈ లోకల్ బాయ్​ హైదరాబాదీ పేసర్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడని, అందుకే జట్టు నుంచి తప్పించారని తెలుస్తోంది. విదేశీ పిచ్​లపై నిప్పులు చెరిగే సిరాజ్, సొంతగడ్డపై మాత్రం తేలిపోతున్నాడు. గత ఏడు టెస్టుల్లోని రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. మొత్తంగా 12 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

ఉప్పల్‌లో ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. 0/28 నమోదు చేశాడు. ఆ తర్వాత రాజ్​కోట్​ వేదికదా జరిగిన ఇంగ్లాండ్​తో మరో టెస్ట్​లో 4/84 చేశాడు. అయితే ఇది ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్​లో తీశాడు. రెండో ఇన్నింగ్స్​లో తేలిపోయాడు. ఇక రాంచీ వేదికగా జరిగిన ఇంగ్లాండ్​తో టెస్ట్​లో రాంచీ టెస్టులో రెండు వికెట్లు (2/78) తీసిన సిరాజ్, ధర్మశాల టెస్టులో వికెట్ (0/24) తీయలేకపోయాడు.

చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి (2/30, 0/32) , రెండో(2/57, 0/19) టెస్టుల్లో రెండేసి వికెట్లు పడగొట్టాడు.

ఇక న్యూజిలాండ్‌తో జరిగిన బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండు (2/84) వికెట్లు సాధించిన సిరాజ్ రెండో (0/16) ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. అందుకే ఇప్పుడు సిరాజ్‌ను రెండో టెస్ట్​ తుది జట్టులోకి తీసుకోకుండా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

ఇక లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులను చేసింది. డేవన్ కాన్వే (47*) హాఫ్ సెంచరీ దిశగా సాగుతుండగా, క్రీజులో అతడికి తోడుగా రచిన్ రవీంద్ర (5*) ఉన్నాడు. ఓపెనర్, కెప్టెన్ టామ్‌ లేథమ్‌ (15)ను ఔట్ చేసిన అశ్విన్‌ భారత్‌కు తొలి వికెట్‌ అందించాడు. లేథమ్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు.

న్యూజిలాండ్​తో రెండో టెస్ట్​ - WTCలో అశ్విన్‌ అదిరే రికార్డ్​

మూడు మార్పులతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా - కివీస్​తో రెండో టెస్ట్​ ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.