Samantha Pickleball Game and Its Rules : హీరోయిన్ సమంత వరల్డ్ పికిల్‌బాల్ లీగ్‌లో ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంతో ఇప్పుడు చాలా మంది దాని గురించి చర్చించుకుంటున్నారు. పికిల్‌బాల్ గేమ్ అంటే ఏంటి? ఎలా ఆడతారు? దాని రూల్స్ ఎలా ఉంటాయి? అని తెలుసుకుంటున్నారు?
అమెరికాలో ప్రారంభం - ఈ పికిల్ బాల్ గేమ్ చూడటానికి టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్‌ను పోలి ఉంటుంది. ఇది 1965లో అమెరికాలో ప్రారంభమవ్వగా ఇప్పుడిప్పుడే మన దగ్గర అడుగులేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ గేమ్ పెద్ద టోర్నీలు జరుగుతుంటాయి. ఇండోర్, అవుట్‌డోర్‌లోనూ దీనిని ఆడొచ్చు. సింగిల్స్‌లో ఇద్దరు, డబుల్స్‌లో నలుగురు ఆడతారు. మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ కాంపిటీషన్స్ నిర్వహిస్తుంటారు. ఈ గేమ్‌ను ఆడేందుకు చెక్కతో చేసిన పాడిల్, హార్డ్ ప్లాస్టిక్ బాల్‌ను ఉపయోగిస్తారు.
రూల్స్ ఇవే - ఈ ఆటకు స్పెషల్ రూల్స్ ఉంటాయి. ఈ గేమ్ ఆడే కోర్టు 44 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉంటుంది. నెట్ ఎత్తు కేవలం 36 అంగుళాలే. టెన్నిస్‌లో రెండు ఫాల్ట్‌లు చేస్తే సర్వీస్ పోయినట్టు కదా, కానీ పికిల్‌బాల్‌లో మాత్రం ఒక్క ఫాల్ట్ ఉంటుంది. డబుల్స్‌లో ఒకసారి మాత్రమే సర్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆట మొదలయ్యాక కనీసం ఒక్కసారైనా బంతి నేలపై బౌన్స్ అయితేనే షాట్ కొట్టాలి. ఆ తర్వాత డైరెక్ట్‌గా బంతిని కొట్టచ్చు.
ఈ పికిల్‌బాల్ గేమ్‌లో సర్వ్ చేసినప్పుడే పాయింట్లు లభిస్తాయి. ప్రతి సెట్ 11 పాయింట్లు అవ్వగానే ముగుస్తుంది. రెండు పాయింట్ల తేడాతో విన్నర్‌ను అనౌన్స్ చేస్తారు. టెన్నిస్‌లో లాగానే సర్వ్ చేసినప్పుడు లేదా గేమ్‌లో భాగంగా నెట్‌ను దాటిపోవాలి. ఇక సర్వ్ చేసేటప్పుడు నో వ్యాలీ జోన్ దగ్గర బాల్‌ను అందుకోకూడదు.
ఈ పికిల్ బాల్ పేరు ఎలా వచ్చిందంటే? - అమెరికాకు చెందిన రాజకీయ వేత్త జోయల్ ప్రిట్చర్డ్ తొలిసారి తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఈ గేమ్ ఆడారు. అనంతరం ఆయన భార్య జోన్ ఓ సారి ఈ గేమ్ గురించి మాట్లాడుతూ 'రోయింగ్‌లో పికిల్ బోట్ ఎలా అయితే ఉంటుందో ఈ ఆట కూడా అలానే ఉంది' అని చెప్పిందట. దీంతో ఈ ఆటకు పికిల్‌బాల్ అని పేరు పెట్టినట్లు కొంతమంది చెబుతుంటారు.
ప్రిట్చర్డ్కు పెంపుడు శునకం కూడా ఉండేది. దాని పేరు పికిల్స్. ప్రిట్చర్డ్ గేమ్‌ను ఆడేటప్పుడల్లా బంతిని పట్టుకోవడానికి ఆ శునకం పరిగెత్తేదని, అందుకే ఆ శునకం పేరునే ఈ ఆటకు పెట్టారనేది మరో వాదన.
అమెరికాలో ఫుల్ క్రేజ్, భారత్‌లో? - అమెరికాలో ఈ పికిల్ బాల్ గేమ్‌కు బాగా క్రేజ్ లభించింది. చాలా మంది దీన్ని సరదాగా ఆడటం మొదలు పెట్టారు. అలా యూఎస్‌ఏలోని అన్ని రాష్ట్రల్లోనూ అసోసియేషన్లు ఏర్పడ్డాయి. అనంతరం వరల్డ్ వైడ్‌గా గేమ్ బాగా విస్తరించింది. ఇప్పటికే కెనడా, యూకే, కొరియా, జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, సింగపూర్, చైనా, మలేషియాలకు విస్తరించింది. ఇక భారత్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది.
సమంత న్యూ 'బిగినింగ్స్' - ఆ స్పోర్స్ట్ టీమ్‌కు ఓనర్‌గా - Samantha New Journey