Virat Kohli vs Joe Root : సుదీర్ఘ ఫార్మట్‌లో టీమ్ ఇండియా స్టార్ కింగ్ కోహ్లీ, ఇంగ్లాండ్ స్టార్ జో రూట్ ఇద్దరూ ఆధునిక క్రికెట్‌లో దిగ్గజాలుగా పేరొందారు. ఇద్దరిలో ఎవరు అత్యుత్తమం అనేదానిపైనా ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. రూటే గొప్ప అని కొందరు, కింగ్ కోహ్లీని మించేవారు లేరు అని మరికొందరు వాదిస్తుంటారు. అయితే ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లలో ఎవరిది పైచేయో, ఇద్దరి మధ్య పోలికలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బ్యాటింగ్ సగటు
జో రూట్: ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ నిలకడైన ఆటతీరుకు నిదర్శనంలా నిలుస్తాడు. టెస్ట్ క్రికెట్‌లో రూట్ సగటు 50పైనే ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ కష్టమైన పిచ్‌పైనా పరుగులు చేయగల సామర్థ్యం రూట్‌కు ఉంది. ఇదే అతడిని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలిపింది. స్పిన్‌పై రూట్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించలగడు.
విరాట్ కోహ్లీ : టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీ సగటు 50 కన్నా తక్కువగా ఉంది. విరాట్ ప్రస్తుత సగటు 49.2గా ఉంది. కానీ కోహ్లీ కొన్నిఅసాధారణమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. క్లిష్టమైన పిచ్‌లపై అద్భుతాలు చేశాడు.
సెంచరీలు, హాఫ్ సెంచరీలు
జో రూట్: టెస్టుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా రూట్ (64)నిలిచాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు (68) చేసి సచిన్ ఈ విభాగంలో టాప్‌లో ఉన్నాడు. సచిన్ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశానికి రూట్ చాలా దగ్గరలో ఉంది. రూట్ మొత్తం 33 శతకాలు చేశాడు. చిన్న స్కోర్లను భారీ స్కోర్లుగా మలచడంలో రూట్ సిద్ధహస్తుడు.
విరాట్ కోహ్లీ: ఒత్తిడిలో ఉన్నప్పుడు కోహ్లీ అత్యద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటాడు. అతడు ఇప్పటివరకూ టస్టుల్లో 30 అర్ధ శతకాలు చేశాడు. 29 శతకాలు చేశాడు. అర్ధ సెంచరీలను సెంచరీలుగా మార్చడంలో కోహ్లీకి తిరుగులేదు. మానసిక దృఢత్వం, ఇన్నింగ్స్‌లో ఆధిపత్యం చెలాయించే సామర్థ్యం కోహ్లీని ప్రత్యేక క్రికెటర్‌గా నిలుపుతుంది.
Test 100s of FAB 4 (Outside Home) :
— Virat Kohli Fan Club (@Trend_VKohli) August 30, 2024
16 - Steve Smith (Out of 32)
15 - Virat Kohli (Out of 29)
13 - Joe Root (Out of 33)
13 - Kane Williamson (Out of 32) pic.twitter.com/pUbmk3jNlz
స్ట్రైక్ రేట్
జో రూట్: టెస్టుల్లో రూట్ స్ట్రైక్ రేట్ దాదాపు 50. ఇది మరీ అంత దూకుడుగా అనిపించకపోవచ్చు కానీ టెస్ట్ క్రికెట్ ఇది చాలా ఎక్కువ. రూట్ డిఫెన్స్, అటాక్ మధ్య చాలా బ్యాలెన్స్ ఉంటుంది. అవసరమైనప్పుడు రూట్ యాంకర్ పాత్ర సమర్థంగా పోషిస్తాడు.
విరాట్ కోహ్లీ: టెస్టుల్లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కోహ్లీ స్ట్రైక్ రేట్ 55 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ స్ట్రైక్ రేట్ టెస్టుల్లోనూ కోహ్లీ దూకుడును తెలుపుతుంది. టెక్నిక్‌లో రాజీపడకుండా త్వరగా భారీ స్కోర్ చేయగల సామర్థ్యం కోహ్లీకి ఉంది.
క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్
జో రూట్: రూట్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఉపఖండంలో కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. స్పిన్‌కు వ్యతిరేకంగా అద్భుత టెక్నిక్‌తో భారీ స్కోర్లు చేశాడు. ఏ పరిస్థితిలోనైనా సమర్థంగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం రూట్‌కు ఉంది.
విరాట్ కోహ్లీ: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో కోహ్లీకి అసాధారణమైన రికార్డు ఉంది. స్వదేశంలో కోహ్లీ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తాడు. పేస్ బౌన్స్‌కి, స్పిన్‌కు వ్యతిరేకంగా కోహ్లీ మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు.
మైలురాళ్ళు, రికార్డులు
జో రూట్: జో రూట్ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగంగా 7,000 టెస్ట్ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
విరాట్ కోహ్లీ: విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో 23,000 అంతర్జాతీయ పరుగులు చేసిన రికార్డు కలిగి ఉన్నాడు. భారత్ సాధించిన అనేక చారిత్రాత్మక విజయాలలో కోహ్లీ భాగమయ్యాడు. విరాట్ నాయకత్వంలో భారత్ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరింది.
గణాంకాలపరంగా, జో రూట్, విరాట్ కోహ్లీ ఇద్దరూ తమ తరంలో అత్యుత్తమ ఆటగాళ్లుగా ఖ్యాతి గడించారు. కోహ్లీ దూకుడు, అధిక స్ట్రైక్ రేట్, రూట్ కన్నా కోహ్లీనే అత్యుత్తమమనేందుకు కాస్త అవకాశం ఇస్తుంది. ఏది ఏమైనా విభిన్న పరిస్థితులలో ఆడగల స్థిరత్వం, సామర్థ్యం రూట్‌ను అత్యుత్తమంగా నిలుపుతోంది. అయితే వీరిద్దరిలో ఎవరు అత్యుత్తమం అంటే కోహ్లీ వైపే కొద్దిగా మొగ్గు చూపవచ్చు. ఎందుకంటే మ్యాచ్ విజేతల పరంగా చూస్తే రూట్ కన్నా కోహ్లీనే అత్యుత్తమమని మాజీలు అంచనా వేస్తున్నారు
జో రూట్ వర్సెస్ స్మిత్ - వీరిద్దరిలో ఎవరు బెస్ట్? - Joe Root VS Steve Smith