Rohit Virat Babar Azam Playing Same Team: క్రికెట్లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌కు క్రేజ్ పీక్స్‌లో ఉంటుంది. ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే ప్లేయర్లే కాదు, ఫ్యాన్స్ కూడా బాగా ఎమోషనల్ అవుతారు. అలాంటిది ఇరు జట్ల స్టార్ ఆటగాళ్లు కలిసి ఒకే టీమ్‌కు ఆడితే ఎలా ఉంటుంది? అవును మీరు చదివింది కరెక్టే! టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా- పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్లు బాబర్ అజామ్, పేసర్ షహీన్ అఫ్రిది తదితర ఆటగాళ్లు కొద్ది రోజుల్లో ఒకే జట్టు తరఫున ఆడే ఛాన్స్ ఉంది! అది ఎలాగా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదివి తెలుసుకోండి.
ఆఫ్రో- ఆసియా కప్
2005, 2007లో ఆఫ్రో- ఆసియా కప్ (Afro-Asia Cup) పేరిట ఓ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేవారు. ఈ టోర్నీలో ఆసియా దేశాల క్రికెటర్లు ఒక జట్టుగా, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు మరో జట్టుగా ఏర్పడి తలపడేవారు. అప్పట్లో ఆసియా జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, ఇర్ఫాన్ పఠాన్, ఇంజామామ్ ఉల్ హక్, జహీర్ ఖాన్, షోయబ్ అక్తర్, షహిద్ అఫ్రిదీ ఆడారు. అటు షాన్ పొలాక్, జాక్వెస్ కలిస్, టాటెండా తైబు వంటి ఆటగాళ్లు ఆఫ్రికా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించారు.
జై షాతో సాధ్యం!
అయితే మళ్లీ ఆ టోర్నీని పునరుద్ధరించాలని ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. 2022లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న జై షాతో అప్పటి ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ (ACC) అధ్యక్షుడు సుమోద్ దామోదర్, ఏసీసీ డెవలప్‌మెంట్ హెడ్ మహింద వల్లిపురం ఈ టోర్నీని పున: ప్రారంభించాలని సంప్రదింపులు జరిపారు. ఇక జై షా ఐసీసీ ఛైర్మన్ కావడం, మరోవైపు మహింద మళ్లీ ఐసీసీ బోర్డు సభ్యునిగా ఎన్నికవడం వల్ల ఆఫ్రో- ఆసియా కప్‌ను నిర్వహణ సాధ్యమయ్యే అవకాశం ఉందని ఏసీసీ మాజీ అధ్యక్షుడు దామోదర్ తెలిపారు. అలా ఒకవేళ ఈ టోర్నీ మళ్లీ జరిగితే భారత్- పాక్ ప్లేయర్లను ఒకే జట్టులో చూడవచ్చు!
టాప్ 5లోకి రోహిత్- శ్రీలంక ప్లేయర్ ఏకంగా 42 స్థానాలు జంప్ - ICC Test Ranking 2024
బాబార్ అజామ్‌పై వేటు! - కొత్త సారథి ఎవరంటే? - Pakisthan Cricket Team New Captain