ETV Bharat / sports

అత్యధిక పరుగులే కాదు - ఆ రికార్డులోనూ విరాట్​కు తిరుగేలేదు! - Virat Kohli RCB - VIRAT KOHLI RCB

Virat Kohli RCB : ఐపీఎల్​ సీజన్​ 17లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 6న) రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ ప్లేయర్ అనేక రికార్డులను బ్రేక్​ చేశాడు. ఇంతకీ అవేంటంటే ?

Virat Kohli RCB
Virat Kohli RCB
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 10:39 AM IST

Updated : Apr 7, 2024, 11:35 AM IST

Virat Kohli RCB : ఐపీఎల్​ 17లో భాగంగా జైపుర్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. ఈ మ్యాచ్​లో విరాట్ కోహ్లీ శతకం బాదినప్పటికీ ఆర్సీబీ జట్టు గెలవలేకపోయింది. జట్టులోని మిగతా బ్యాటర్స్ రాణించనప్పటికీ భారన్ని మొత్తం తన భుజాలపై మోసి ఇన్నింగ్స్‌ను చివరిదాకా నడిపించాడు నాటౌట్‌గా నిలిచాడు. అలా ఈ ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించడమే కాకుండా, 5 మ్యాచ్‌లకే 316 పరుగులతో టాప్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు విరాట్. దీంతో పాటు మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

  • ఐపీఎల్‌లో కోహ్లీ ఇప్పటి వరకు 8 సెంచరీలు చేశాడు. అత్యధిక సెంచరీల జాబితాలో టాప్​ పొజిషన్​లో ఉన్నాడు. ఇక విరాట్ తర్వాత జోస్ బట్లర్‌ (6), క్రిస్ గేల్‌ (6) ఈ లిస్ట్​లో ఉన్నారు.
  • ఐపీఎల్‌లో విరాట్ ఆడిన గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో అతడికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం.
  • ఈ మ్యాచ్‌లో కోహ్లీ 113 పరుగులు స్కోర్ చేశాడు. ఈ స్కోర్​తో ఐపీఎల్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరును విరాట్ సమం చేశాడు. 2016లో పంజాబ్‌ జట్టుపై కోహ్లీ సరిగ్గా 113 రన్స్ సాధించాడు.
  • ఐపీఎల్‌లో కోహ్లీ ఇప్పటివరకు 7579 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ల లిస్ట్​లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న ఈ స్టార్​లో లీగ్‌లో 7500 మైల్​స్టోన్​ను దాటాడు. 234 ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఈ రికార్డు నమోదు చేశాడు. ఇదే లిస్ట్​లో విరాట్ తర్వాత రెండో స్థానంలో ధావన్‌ (220 ఇన్నింగ్స్‌లో 6755 పరుగులు) ఉన్నాడు.
  • ఐపీఎల్​లో విరాట్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 110 బంతులను క్యాచ్ చేసి, ఐపీఎల్​లో అత్యథిక క్యాచ్​లు పట్టిన నాన్ వికెట్​ కీపర్​గా రికార్డుకెక్కాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే - ఐపీఎల్​లో రాజస్థాన్​ రాయల్స్​ జైత్రయాత్ర కొనసాగుతోంది. రాజస్థాన్​ టోర్నీలో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. శనివారం జైపుర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

బెంగళూరు నిర్దేశించిన 184 పరుగుల టార్గెట్​ను 4 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. జాస్ బట్లర్ (100*), కెప్టెన్ సంజూ శాంసన్ (69) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో రీస్ టోప్లే 2, మహ్మద్ సిరాజ్​, యశ్ దయాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ఒక్కసారి హెయిర్​కట్​కు విరాట్ అంత ఖర్చు చేస్తాడా? - Virat Kohli Hairstyle Cost

ఐపీఎల్​లో 'విరాట్' మరో రికార్డ్- దరిదాపుల్లో కూడా ఎవరూ లేరుగా! - Virat Kohli Ipl Runs

Last Updated : Apr 7, 2024, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.