ETV Bharat / sports

ఐపీఎల్​లో 'విరాట్' మరో రికార్డ్- దరిదాపుల్లో కూడా ఎవరూ లేరుగా! - Virat Kohli Ipl Runs

Virat Kohli Ipl Runs: జైపుర్ వేదికగా ఆర్సీబీ- రాజస్థాన్​తో మ్యాచ్​లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్​లో పలు రికార్డులు సాధించాడు.

Virat Kohli Ipl Runs
Virat Kohli Ipl Runs
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 8:31 PM IST

Updated : Apr 6, 2024, 9:23 PM IST

Virat Kohli Ipl Runs: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శనివారం రాజస్థాన్​తో మ్యాచ్​లో పలు రికార్డ్​లు సాధించాడు. ఐపీఎల్​లో అత్యధిక సెంచరీలు (8) బాదిన ఘనతతోపాటు, 7500+ పరుగులు నమోదు చేసిన తొలి క్రికెటర్​గా రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచ్​లో విరాట్ (113 పరుగులు, 72 బంతుల్లో ; 12x4, 4x6) సెంచరీ ఇన్నింగ్స్​తో ఈ మైలురాళ్లు అందుకున్నాడు. కాగా, 2024 ఐపీఎల్​లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

ఐపీఎల్​లో ఇప్పటివరకూ 242 మ్యాచ్​లు ఆడిన విరాట్ 130.36 స్ట్రైక్ రేట్​తో 7575 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా ఒకే సీజన్​ (2016)లో 973 పరుగులు బాదాడు. ఈ ఒక్క సీజన్​లోనే విరాట్ నాలుగు శతకాలు నమోదు చేశాడు. 2016లో ఆరెంజ్ క్యాప్ సైతం విరాట్​కే దక్కింది. ఇక సింగిల్ ఎడిషన్​లో అత్యధిక పరుగులు (973) బాదిన రికార్డ్ కూడా విరాట్ పేరిటే ఉంది. ఇక అత్యధిక పరుగుల జాబితాలో విరాట్ తర్వాత స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ (6754 పరుగులు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఐపీఎల్​లో ఆత్యధిక పరుగులు బాదిన బ్యాటర్లు

  • విరాట్ కోహ్లీ- 7575 పరుగులు (242 మ్యాచ్​లు)
  • శిఖర్ ధావన్- 6754 పరుగులు (221 మ్యాచ్​లు)
  • డేవిడ్ వార్నర్- 6545 పరుగులు (180 మ్యాచ్​లు)
  • రోహిత్ శర్మ- 6280 పరుగులు (246 మ్యాచ్​లు)
  • సురేశ్ శర్మ- 5528 పరుగులు (205 మ్యాచ్​లు)

ఐపీఎల్​లో ఆత్యధిక సెంచరీలు

  • విరాట్ కోహ్లీ- 8 సెంచరీలు
  • క్రిస్ గేల్- 6 సెంచరీలు
  • జాస్ బట్లర్- 5 సెంచరీలు
  • కేఎల్ రాహుల్- 4 సెంచరీలు
  • షేన్ వాట్సన్- 4 సెంచరీలు
  • డేవిడ్ వార్నర్- 4 సెంచరీలు

ఇక మ్యాచ్​విషయానికొస్తే, టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (113), ఫాఫ్ డూప్లెసిస్ (44 పరుగులు) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 2, నంద్రె బర్గర్ 1 వికెట్ దక్కించుకున్నారు.

ఆర్సీబీ x రాజస్థాన్- విరాట్​ను ఊరిస్తున్న రికార్డులు - Virat Kohli IPL 2024

విరాట్, పరాగ్ పరుగులు సేమ్- క్యాప్ మాత్రం రియాన్​కే- ఎందుకో తెలుసా? - 2024 IPL Orange Cap

Last Updated : Apr 6, 2024, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.