ETV Bharat / sports

కింగ్ కోహ్లీ వచ్చేశాడు -కొత్త లుక్​లో IPLకి రెడీ- ఫొటోస్ చూశారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 12:07 PM IST

Updated : Mar 17, 2024, 12:15 PM IST

Virat Kohli IPL 2024: 2024 ఐపీఎల్​కు సర్వం సిద్ధమైంది. మార్చి 22న గ్రాండ్​గా సీజన్ 17 ప్రారంభం కానుంది. ఇక ఈ టోర్నీలో ఆడేందుకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి ముంబయి చేరుకున్నాడు. అకాయ్ పుట్టిన తర్వాత తొలిసారిగా కోహ్లీ ముంబయి ఎయిర్​పోర్టులో దర్శనమిచ్చాడు.

Virat Kohli IPL 2024
Virat Kohli IPL 2024

Virat Kohli IPL 2024: 2024 ఐపీఎల్ మరో 5 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా జట్ల ప్లేయర్లు ఇప్పటికే ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. అయితే కొన్ని రోజులుగా అందరి దృష్టి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల దాదాపు రెండు నెలలుగా క్రికెట్​కు దూరంగా ఉన్న విరాట్ ఈ ఐపీఎల్​లో బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలో విరాట్ ఎప్పుడెప్పుడు బ్యాట్​తో మైదానంలోకి దిగుతాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విరాట్ ముంబయి ఎయిర్​పోర్టులో కెమెరాకు చిక్కాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

ఆదివారం విరాట్ ముంబయి ఎయిర్ పోర్టులో న్యూ లుక్​తో దర్శనమిచ్చాడు. తన వారసుడు అకాయ్ కోహ్లీ పుట్టిన తర్వాత లండన్ నుంచి భారత్​ వచ్చిన కోహ్లీ తెల్లగడ్డంతో కనిపించాడు. ఈ కొత్త లుక్​లో విరాట్​ను చూసిన తన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 'తెల్లగడ్డంతో అకాయ్ డాడీ' అంటూ క్యాప్షన్ ఇస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక భారత్​కు వచ్చిన విరాట్ త్వరలోనే ఆర్సీబీ క్యాంప్​లో చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు.ఇక మార్చి 22న జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్​ కింగ్స్​ మ్యాచ్​తో 2024 ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇరుజట్లు కూడా గెలుపుతోనే సీజన్​ను ఆరంభించాలని భావిస్తున్నాయి.

కాగా, అనుష్క శర్మ- విరాట్ దంపతులకు ఫిబ్రవరి 15న​ కొడుకు పుట్టిన విషయం విదితమే. ఈ దంపతులకు ఇదివరకే కూతురు (వామిక) జన్మించింది. ఇక రెండోసారి తండ్రి అయిన కారణంగా విరాట్ గత రెండు నెలలుగా లండన్​లోనే ఉన్నాడు. ఈ కారణంగానే రీసెంట్​గా ముగిసిన భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్​కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని కోహ్లీ సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించాడు. ఇక కోహ్లీ చివరిగా 2024 జనవరిలో ఆఫ్గానిస్థాన్​తో జరిగిన టీ20 సిరీస్​లో ఆడాడు. ఇక మార్చి 19న బెంగుళూరులో జరగనున్న ఆర్సీబీ ఆన్వెల్ ఇన్ బాక్స్ ప్రమోషన్ ఈవెంట్​లో విరాట్ పాల్గొనే అవకాశం ఉంది.

విరాట్​ బొమ్మ గీసిన స్మృతి- డ్రాయింగ్​లో కింగ్​ 'కిరీటమే' హైలైట్

ఇన్​స్టాలో విరాట్ సెన్సేషన్ - ఆ ఘనత అందుకున్న తొలి భారతీయుడిగా రికార్డు

Last Updated : Mar 17, 2024, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.