ETV Bharat / sports

ఆర్సీబీ x రాజస్థాన్- విరాట్​ను ఊరిస్తున్న రికార్డులు - Virat Kohli IPL 2024 - VIRAT KOHLI IPL 2024

Virat Kohli IPL 2024: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శనివారం రాజస్థాన్​తో జరగనున్న మ్యాచ్​లో పలు రికార్డులు అందుకునే ఛాన్స్ ఉంది. అవేంటంటే

Virat Kohli IPL 2024
Virat Kohli IPL 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 5:21 PM IST

Updated : Apr 6, 2024, 6:59 PM IST

Virat Kohli IPL 2024: 2024 ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శనివారం (ఏప్రిల్ 6) జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్​తో తలపడునుంది. ప్రస్తుత సీజన్​లో హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్ సొంత గడ్డపై మరో గెలుపు నమోదు చేయాలని ఊవ్విళ్లూరుతుండగా, ఈ మ్యాచ్​తోనైనా మళ్లీ గెలుపు బాట పట్టాలని ఆర్సీబీ భావిస్తోంది. కాగా, ఈ సీజన్​లో ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్​లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒకే విజయం నమోదు చేసి, మూడింట్లో ఓడింది.

అయితే ఈ మ్యాచ్​లో అందరి కళ్లూ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉండనున్నాయి. ఇప్పటికే నాలుగు మ్యాచ్​ల్లో 203 పరుగులతో టాప్ రన్​ స్కోరర్ లిస్ట్​లో టాప్​లో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్​లోనూ విరాట్ రాణించాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో విరాట్ ఈ మ్యాచ్​లో పలు రికార్డులు అందుకునే ఛాన్స్ ఉంది. మరి కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఏమిటంటే?

  • ఐపీఎల్​లో ఇప్పటివరకూ 241 మ్యాచ్​లు ఆడిన విరాట్ 7466 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్​లో మరో 34 పరుగులు బాదితే ఐపీఎల్​లో 7500 పూర్తి చేసిన తొలి బ్యాటర్​గా రికార్డు సృష్టిస్తాడు. ఈ లిస్ట్​లో విరాట్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. 6755 పరుగులతో పంజాబ్ బ్యాటర్ శిఖర్ ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు.
  • ఈ మ్యాచ్​లో విరాట్ 62 పరుగులు చేస్తే, రాజస్థాన్​ రాయల్స్​పై అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్​గా నిలుస్తాడు. అతడు ఇప్పటివరకూ రాజస్థాన్​పై 29 మ్యాచ్​ల్లో 618 పరుగులు చేశాడు. ఈ లిస్ట్​లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ (679 పరుగులు) టాప్​ ప్లేస్​లో ఉన్నాడు.
  • ఐపీఎల్​లో విరాట్ ఇప్పటివరకూ 242 సిక్స్​లు బాదాడు. మరో 8 సిక్స్​లు బాదితే ఐపీఎల్​లో 250 సిక్స్​లు పూర్తి చేసుకుంటాడు. అయితే విరాట్ భారీ ఇన్నింగ్స్​ ఆడితే గాని 8 సిక్స్​లు బాదడం సాధ్యం కాదు. ఇక స్టార్ బ్యాటర్లు క్రిస్ గేల్ (357), రోహిత్ శర్మ (261), ఏబీ డివిలియర్స్ (251) ముగ్గురే ఈ మార్క్ అందుకున్నారు.

IPL టిక్కెట్ల కోసం ఫ్యాన్స్​ తిప్పలు- దిండు, దుప్పటితో రాత్రంతా స్టేడియం వద్దే - RCB vs RR Match Tickets IPL 2024

మనసులు గెలుకున్న కింగ్ కోహ్లీ - రింకూకు స్పెషల్ గిఫ్ట్​ - Virat Kohli Bat

Last Updated : Apr 6, 2024, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.