Virat Kohli ICC Trophy : పరుగుల వీరుడు విరాట్ కోహ్లికి ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ (ICC Mens ODI Cricketer of the Year-2023) వరించింది. 2023 ఏడాదికి గానూ అతడిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ). ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీలో విరాట్‌కు ఇది నాలుగో అవార్డు కావడం విశేషం. 2012, 2017, 2018, 2023 ఏడాదిల్లోనూ విరాట్‌కు ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు వరించాయి.
10వ ఐసీసీ అవార్డు
ప్రస్తుతం వచ్చిన తాజా అవార్డుతో విరాట్ సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇప్పటిదాకా మరే క్రికెటర్‌కు సాధ్యంకాని మైలురాయిని అందుకున్నాడు. అదే తన కెరీర్లో పది ఐసీసీ అవార్డులను సాధించడం. ఇందులో నాలుగు అవార్డులు ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీలోనే వచ్చాయి.
-
Player of the tournament at the ICC Men’s @cricketworldcup 2023 😎
— ICC (@ICC) January 25, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
The extraordinary India batter has been awarded the ICC Men’s ODI Cricketer of the Year 💥 https://t.co/Ea4KJZMImE
">Player of the tournament at the ICC Men’s @cricketworldcup 2023 😎
— ICC (@ICC) January 25, 2024
The extraordinary India batter has been awarded the ICC Men’s ODI Cricketer of the Year 💥 https://t.co/Ea4KJZMImEPlayer of the tournament at the ICC Men’s @cricketworldcup 2023 😎
— ICC (@ICC) January 25, 2024
The extraordinary India batter has been awarded the ICC Men’s ODI Cricketer of the Year 💥 https://t.co/Ea4KJZMImE
విరాట్‌కు ఆమడ దూరంలో
ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో ఇప్పటివరకు 4 అవార్డులను సాధించిన విరాట్ రికార్డ్‌కు దరిదాపుల్లో మరే క్రికెటర్ లేరు. మొత్తంగా ఇప్పటిదాకా 10 ఐసీసీ ట్రోఫీలను దక్కించుకున్న ఈ పరుగుల వీరుడు అత్యధిక ఐసీసీ టైటిల్స్‌ను గెలిచిన ఆటగాళ్ల లిస్ట్‌లో మొదటిస్థానంలో కొనసాగుతుండగా, రెండో స్థానంలో శ్రీలంక ప్లేయర్ 4 అవార్డులతో కుమార సంగక్కర్, టీమ్ఇండియా మాజీ ప్లేయర్ ఎంఎస్ ధోనీ ఉన్నారు. క్రికెట్ చరిత్రలోనే కనీసం 5 ఐసీసీ ట్రోఫీలను కూడా మరే ఆటగాడు ఇప్పటివరకు గెలవకపోవడం గమనార్హం.
టీ20లోనూ మనోడే
మరోవైపు ఐసీసీ అవార్డుల జాబితా-2023లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా ఉన్నాడు. ఇతడికి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించనుంది. అలాగే ఆసీస్ మరో ఆటగాడు ఉస్మాన్ ఖవాజాకు కూడా 2023 ఏడాదికి గానూ ఐసీసీ అవార్డు దక్కింది. ఇతడు ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఐసీసీ నుంచి అందుకోనున్నాడు. టీమ్ఇండియా నుంచి సూర్య కుమార్ యాదవ్ ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2023 అవార్డుకు సెలెక్ట్ అయ్యాడు.