Vinesh Phogat Paris Olympics: భారత స్టార్ అథ్లెట్ వినేశ్ ఫొగాట్ అస్వస్థకు గురయ్యారట. డీగైడ్రేషన్ కారణంగా ఆమె అనారోగ్యం పాలవ్వగా, తనను పారిస్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని సమాచారం. సాధారణంగా ప్లేయర్లు రెండు రోజులు ముందు నుంచే తమ బరువును నిర్ణీత కేటగిరి పరిధిలోనే ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే మంగళవారం బౌట్ సమయంలో ఆమె తన బరువు నియంత్రణలోనే ఉంచుకొన్నట్లు తెలుస్తోంది. కానీ, మంగళవారం రాత్రికి వినేశ్ 2 కిలోల ఓవర్‌వెయిట్ ఉంది. దీంతో జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటివి బరువు తగ్గేందుకు దోహదపడే ఎక్సర్సైజ్లు చేసింది.
అంతేకాకుండా భోజనం కూడా తీసుకోకుండా, బరువును తగ్గించుకునేందుకు రాత్రంతా ఆమె నిద్రపోకుండా మేల్కొనే ఉన్నట్లు సమాచారం. దీని కారణంగానే వినేశ్ ఇప్పుడు డీహైడ్రేషన్‌కు గురైనట్లు క్రీడా వర్గాల మాట. ఆమెకు ఒలింపిక్ గ్రామంలోని ఓ పాలిక్లినిక్‌లో చికిత్స అందుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
'100గ్రాములు బరువు ఎక్కువున్నా అనుమతిస్తారు కదా?'
పసిడి పోరుకు అర్హత సాధించిన వినేశ్ ఫొగాట్‌పై అనూహ్యంగా అనర్హత వేటు పడటం అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది. వంద గ్రాముల అధిక బరువు ఉండడం వల్ల ఒలింపిక్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పడం విమర్శలకు దారీ తీసింది. ఈ క్రమంలోనే వినేశ్ ఫోగాట్ పెద్ద నాన్న మహవీర్ స్పందించారు. 'గోల్డ్ మెడల్ కోసం దేశమంతా ఎంతో ఎదురు చూసింది. సాధారణంగా రెజ్లర్ ఓ 50-100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆడటానికి అనుమతిస్తారు. అయితే, అక్కడ రూల్స్ మాత్రం మరోలా ఉండటం వల్ల అనర్హత వేటు పడింది. దేశ ప్రజలెవరూ నిరాశ చెందొద్దు. ఆమె ఏదో ఒక రోజు కచ్చితంగా దేశం కోసం మెడల్‌ను తెచ్చి పెడుతుంది. ఆమెను నెక్ట్స్ ఒలింపిక్స్ కోసం సన్నద్ధం చేస్తాను' అని అన్నారు. ఇక ఆమె అనర్హత వేటుపై ఇప్పటికే ప్రధాని మోదీ సహా పలువురు క్రీడా ప్రముఖులు స్పందించారు. ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
#WATCH | On Indian wrestler Vinesh Phogat's disqualification from #ParisOlympics2024, her uncle Mahavir Phogat says, " i have nothing to say. the entire country has expected gold... rules are there but if a wrestler is 50-100 grams overweight they are usually allowed to play. i… pic.twitter.com/h7vfnJ8ZuH
— ANI (@ANI) August 7, 2024
వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు - ఒలింపిక్స్‌కు ఐఓఏ ఛాలెంజ్ - Vinesh Phogat Paris Olympics 2024