Travis Head On IND VS AUS Test : మైదానంలో దూకుడుగా ఆడే ప్లేయర్లలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ పేరు టాప్‌లో ఉంటుంది. గతంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు కూడా. వికెట్లు పడుతున్నా కూడా స్కోర్ బోర్డును అలావోకగా పరుగులు పెట్టిస్తాడు.
అయితే నవంబర్ నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. డేవిడ్ వార్నర్ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం వల్ల ఇప్పుడు అతడి స్థానాన్ని ట్రావిస్ హెడ్ భర్తీ చేస్తాడంటూ క్రికెట్ వర్గాల మాట. ఉస్మాన్ ఖవాజా కూడా తనతో హెడ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే బాగుంటుందంటూ ఇటీవలె ఓ సందర్భంలో అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో హెడ్ కూడా ఈ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. అదే సమయంలో భారత్‌తో ఆడటం అంత ఈజీ టాస్క్ కాదని పేర్కొన్నాడు.
"టీమ్‌ఇండియా నా ఫేవరెట్ ప్రత్యర్థి కాదనుకుంటాను. ఇతర టీమ్స్‌తో ఆడినట్లే వారితోనూ ఆడతాను. గత రెండేళ్లుగా నేను మంచి ఫామ్‌లో ఉన్నాను. అందుకే, భారత్‌పైనా నాణ్యమైన ఇన్నింగ్స్‌ను నేను ఆడగలిగాను. టీమ్‌ఇండియాతో గేమ్ చాలా కష్టంగా ఉంటుంది. అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తేనే పరుగులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఏమాత్రం అలసత్వం వహించినా కూడా ఇక వికెట్ పోయినట్లే. అందుకోసమే నేను నా ప్రాక్టీస్‌ను తీవ్ర స్థాయిలో చేస్తుంటాను. తప్పకుండా రానున్న సిరీస్‌లో నావంతు భాగస్వామ్యాన్ని అందిచేందుకు ప్రయత్నిస్తాను" అంటూ హెడ్ వెల్లడించాడు.
ఆ టీమ్‌కు షమీ స్వీట్ వార్నింగ్!ఋ
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ కోసం ఆయా జట్ల ప్లేయర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత వన్డే ప్రపంచ కప్ తర్వాత ఆపరేషన్ చేయించుకున్న షమీ కొద్ది నెలల విశ్రాంతి తర్వాత తిరిగి బౌలింగ్ ప్రాక్టీస్‌లో బిజీ అయిపోయాడు. ఈ నేపథ్యంలో రానున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కల్లా సిద్ధమయ్యేలా అతడు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆసీస్‌ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
"భారత్ జట్టే ఫేవరెట్. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పటికే ఆసీస్ శిబిరంలో పెద్ద దీనిపై ఆందోళన మొదలై ఉంటుంది. టీమ్‌ఇండియాను ఓడించాలంటే మీ స్కిల్క్ను మరింత షార్ప్ చేసుకోండి." అని షమీ ఆసీస్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.