ETV Bharat / sports

వన్డేల్లో హైయెస్ట్​ రన్స్​ చేసిన టీమ్​ఇండియా క్రికెటర్లు ఎవరు? రోహిత్‌ స్థానమెంత? - Top Indian Batters In ODI - TOP INDIAN BATTERS IN ODI

Top Indian Batters In ODI : ఇండియా తరఫున చాలా మంది బ్యాటర్లు సుదీర్ఘ కాలం వన్డేల్లో కొనసాగారు. అయితే టీమ్ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన టాప్‌ బ్యాటర్లు ఎవరో తెలుసా?

Top 5 batters with most runs for India in ODIs
Top 5 batters with most runs for India in ODIs (Associated Press, Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 23, 2024, 9:46 PM IST

Top Indian Batters In ODI : ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో కనబరిచాడు. తొలి మ్యాచ్‌లో 47 బంతుల్లో 58 పరుగులు, రెండో మ్యాచ్‌లో 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. 37 ఏళ్ల రోహిత్‌ కొన్నేళ్లుగా వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 2023 సెప్టెంబర్ నుంచి 19 ఇన్నింగ్సుల్లో 55.22 యావరేజ్‌తో 123.94 స్ట్రైక్ రేట్‌తో 994 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 9 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. గత 10 వన్డేల్లో ఏకంగా 4 హాఫ్ సెంచరీలు, ఐదు 40 ప్లస్‌ స్కోర్‌లు ఉండటం గమనార్హం. ఆగస్టు 4న కొలంబోలో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్‌ (64 పరుగులు) అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నాలుగో స్థానానికి చేరాడు. అయితే వన్డే ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు వీళ్లే.

సచిన్ తెందూల్కర్‌
వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తం 463 మ్యాచ్‌లు (452 ఇన్నింగ్స్‌లు) ఆడాడు. ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 44.83 యావరేజ్‌తో 18,426 పరుగులు చేశాడు. 2010 ఫిబ్రవరిలో గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అత్యధిక స్కోరు 200 సాధించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాటర్ సచిన్.

విరాట్ కోహ్లీ
ఈ జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. 294 మ్యాచ్‌లు (282 ఇన్నింగ్స్‌లు) ఆడాడు. 58.34 యావరేజ్‌తో 13,886 పరుగులు చేశాడు. ఇందులో 50 సెంచరీలు, 72 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2012 మార్చిలో ఆసియా కప్‌లో మిర్పూర్‌లో పాకిస్థాన్‌పై కోహ్లి అత్యధిక స్కోరు 183 చేశాడు.

సౌరభ్​ గంగూలీ
అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సౌరభ్​ గంగూలీ మూడో స్థానంలో ఉన్నాడు. గంగూలీ ఇండియా తరఫున 308 వన్డేలు (297 ఇన్నింగ్స్‌లు) ఆడాడు. 22 సెంచరీలు, 71 హాఫ్‌ సెంచరీలు చేశాడు. మొత్తంగా 40.95 యావరేజ్‌తో 11,221 పరుగులు చేశాడు. 1999 ప్రపంచకప్‌లో శ్రీలంకతో టాంటన్‌లో జరిగిన మ్యాచ్‌లో గంగూలీ అత్యధిక స్కోరు 183 సాధించాడు.

రోహిత్ శర్మ
వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు. 264 మ్యాచుల్లో (256 ఇన్నింగ్స్‌లు), రోహిత్ 31 సెంచరీలు, 57 హాఫ్‌ సెంచరీలు చేశాడు. మొత్తంగా 49.23 యావరేజ్‌తో 10,831 పరుగులు చేశాడు. వన్డే చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్. 2014 నవంబర్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై అతని అత్యధిక స్కోరు 264 పరుగులు చేశాడు.

రాహుల్ ద్రవిడ్
ద్రవిడ్ వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ 340 వన్డేలు(314 ఇన్నింగ్స్‌లు) ఆడాడు. 12 సెంచరీలు, 82 హాఫ్‌ సెంచరీలు బాదాడు. 39.15 యావరేజ్‌తో మొత్తం 10,768 పరుగులు చేశాడు. 1999 నవంబర్‌లో హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌పై ద్రవిడ్ అత్యధిక స్కోరు 153 చేశాడు.

బ్యాట్ పడితే దూకుడే - ప్రత్యర్థి ఎవరైనా తగ్గేదే లే - టాప్‌ 5 అగ్రెసివ్‌ క్రికెటర్లు వీళ్లే! - Aggressive Cricketers In World

టీ20ల్లో వీరి దూకుడు మామూలుగా ఉండదు! రోహిత్​ కన్నా ఎక్కువ సిక్సర్లు కొట్టిందెవరంటే? - Cricketers WithMoreSixes Than Rohit

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.