Indian Cricketers Police And Army Ranks : ఆయా రంగాల్లో అత్యుత్తమంగా రాణించిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైన్యం, పోలీసు శాఖల్లో ఉన్నత పదవులు ఇచ్చి గౌరవిస్తుంటాయి. ఈ లిస్టులో చాలా మంది భారత క్రికెటర్లు ఉన్నారు. పురుషులతో పాటు మహిళా క్రికెటర్లు కూడా పోలీసు శాఖలో కొలువులు అందుకున్నారు. ఈ లిస్టులోని క్రికెటర్లు ఎవరు? ఏ హోదాల్లో పని చేస్తున్నారు? ఇప్పుడు చూద్దాం.
- ఎంఎస్ ధోని : భారత మాజీ కెప్టెన్ ఎంస్ ధోనీ, ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాలో ఉన్నాడు. 2015లో పారాచూట్ రెజిమెంట్ శిక్షణ పొందాడు.
- మహ్మద్ సిరాజ్ : 2024 టీ20 ప్రపంచ కప్ విజేత మహ్మద్ సిరాజ్‌ను తెలంగాణ ప్రభుత్వం గౌరవించింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) పోస్ట్ అందజేసింది.
- హర్మన్‌ప్రీత్ కౌర్ : ప్రస్తుత భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పంజాబ్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) హోదాలో ఉంది.
- హర్భజన్ సింగ్: భారత మాజీ లెజెండరీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పంజాబ్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) హోదా అందుకున్నారు.
- సచిన్ తెందూల్కర్ : క్రికెట్ లెజెండ్ సచిన్‌కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్ గౌరవ ర్యాంక్ లభించింది. క్రికెట్‌లో దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.
- జోగిందర్ శర్మ : టీమ్‌ఇండియా మాజీ ప్లేయర్ జోగిందర్ శర్మ హరియాణా పోలీస్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా ఉన్నాడు. జోగిందర్ ప్రస్తుతం ఆన్ డ్యూటీ చేస్తున్నాడు.
- కపిల్ దేవ్ : భారత జట్టు మాజీ కెప్టెన్, 1983 ప్రపంచ కప్ హీరో కపిల్ దేవ్‌కు కూడా మిలిటరీ హోదా ఉంది. 2008లో అతడు టెరిటోరియల్ ఆర్మీలో చేరాడు. లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ ర్యాంక్ పొందాడు. వాస్తవానికి కపిల్ సైనిక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాడు. అతడి తండ్రి రామ్ లాల్ నిఖాంజ్ సైతం భారత సైన్యంలో పని చేశారు.