ETV Bharat / sports

ఇంటర్నేషనల్ బౌలర్లు కంఫర్ట్, పట్టు కోసం ఏ షూస్ వాడుతారో తెలుసా?

స్నిన్నర్లతో పోలిస్తే పేస్ బౌలర్ల శ్రమ అధికం!- పేసర్లకు ఏ షూస్​ బాగుంటాయంటే?

Top 5 Cricket Shoes For Fast Bowlers
Top 5 Cricket Shoes For Fast Bowlers (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Top 5 Shoes For Fast Bowlers : క్రికెట్​లో స్పిన్ బౌలర్లతో పోలిస్తే పేసర్లకు ఎక్కువ శ్రమ ఉంటుంది. ఎందుకంటే 140-150కి.మీ వేగంతో బంతిని విసరాల్సి ఉంటుంది. అందుకు వికెట్ల వెనుక నుంచి స్పీడ్ గా పరుగెత్తుకుని రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారి కాళ్లకు ఉన్న షూస్ చాలా ముఖ్యం. ఎందుకంటే బౌలర్లు వేగంగా బాల్ వేసేటప్పుడు వాళ్ల కాళ్లకు పట్టును ఇస్తాయి ఆ షూస్.

అలాగే మైదానంలో బౌలర్ల పనితీరును మెరుగుపరచడంలోనూ ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. షూస్ కంఫర్ట్​గా లేకపోతే అనుకున్న రీతిలో పేసర్లు బాల్ వేయలేరు. అందుకే ఫాస్ట్ బౌలర్లు తాము ధరించే షూ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ క్రమంలో మార్గెట్ వర్గాల ప్రకారం ఈ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండే 5రకాల షూస్​ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అడిడాస్ అడిపవర్ వెక్టర్ 20
అడిడాస్ అడిపవర్ వెక్టర్ 20 ప్రత్యేకంగా ఫాస్ట్ బౌలర్ల కోసం రూపొందించినవి ఈ షూస్. ఈ డిజైన్ పేసర్లకు అనుకూలంగా, తేలికగా ఉంటుంది. బౌలర్లకు కంఫర్ట్​గా అనిపిస్తాయని, అలాగే అడిడాస్ షూస్ కాళ్లకు పట్టునిస్తాయి. అలాగే వేగంగా పరుగెత్తడానికి సహాయపడుతాయని తెలుస్తోంది. బౌలర్ల పనితీరును మెరుగుపరచడంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

న్యూ బ్యాలెన్స్ CK4030 L4 2E స్పైక్
న్యూ బ్యాలెన్స్ షూస్​ను బౌలర్లు విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇవి వారి పాదాలకు కంఫర్ట్​గా అనిపిస్తాయి. ఈ షూస్ డిజైన్ బాగుంటుంది. పేసర్లకు న్యూ బ్యాలెన్స్ షూస్ కూడా ఒక మంచి ఆప్షన్ అవుతాయి.

ఆసిక్స్ జెల్ స్పీడ్ మెనాస్
ఆసిక్స్ జెల్ స్పీడ్ మెనాస్ షూస్ పేసర్లకు బాగా ఉపయోగపడతాయట. ఈ షూస్​తో పేసర్లు స్పీడ్​గా బౌలింగ్ చేయొచ్చు. అలాగే బౌలర్ పాదాలకు కంఫర్టబుల్​గా సెట్ అవుతాయట. ఈ షూస్ ఫ్లాటర్ డిజైన్​లో ఉంటాయి. ఫాస్ట్ బౌలర్లు ఎక్కువ సమయం బౌలింగ్ చేయడానికి అవసరమైన గ్రిప్‌, కుషనింగ్, స్టెబిలిటీని అందిస్తాయి.

పూమా మెన్స్ 19.1
పూమా బ్రాండ్ షూస్ పేసర్లకే కాకుండా, బ్యాటర్లకు కూడా అనుకూలంగా ఉంటాయట. అయితే బౌలింగ్ సమయంలో పేసర్లకు కాళ్లకు మంచి గ్రిప్​ను ఇస్తాయని తెలుస్తోంది. అలాగే బరువు కూడా తక్కువగా ఉంటాయట. ఫాస్ట్​గా బౌలింగ్ చేసేవారికి ఇవి బాగా పనికొస్తాయట.

కూకబుర్రా మెన్స్ KC 3.0 స్పైక్
ఈ మోడల్ షూస్ లెదర్​తో తయారైనవి. దీని డిజైన్ పేసర్లను బాగా పనికొస్తుంది. బౌలింగ్ చేసేటప్పుడు కాలు జారిపోకుండా గ్రిప్ గా ఉంచుతుందట. అలాగే బౌలర్లకు కంఫర్ట్ గా అనిపిస్తాయని క్రికెటర్లు కూడా చెబుతుంటారు.

కోహ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్​లలో ధరించే సన్ గ్లాసెస్ ధర అంతా? - Kohli Oakley sunglasses Price

అంతర్జాతీయ మ్యాచ్‌లకు బుమ్రా ఉపయోగించే 'షూ' ధర ఎంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.