ETV Bharat / sports

WPLలో తెలుగమ్మాయిలు- వీరిలో సత్తా చాటేదెవరో? - Wpl schedule 2024

Telugu Cricketers WPL: మహిళల ఐపీఎల్​ శుక్రవారం (ఫిబ్రవరి 23) పారంభం కానుంది. ఈ టోర్నీలో రాణించి, టీమ్ఇండియా తలుపుతట్టాలని అనేక మంది యంగ్ ప్లేయర్లు ఆశిస్తారు. అయితే ప్రస్తుత టోర్నీలో ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు క్రికెటర్లెవరో మీకు తెలుసా?

Telugu Cricketers WPL
Telugu Cricketers WPL
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 7:18 PM IST

Telugu Cricketers WPL: 2024 డబ్ల్యూపీఎల్​కు రంగం సిద్ధమైంది. ఈరోజు (ఫిబ్రవరి 23) రెండో ఎడిషన్ మహిళల ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ముంబయి ఇండియన్స్- దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్​తో టోర్నీకి తెరలెవనుంది. అయితే ఈ టోర్నీలో సత్తా చాటేందుకు మన తెలుగమ్మాయిలూ సిద్ధమయ్యారు. మరి వారెవరో చూసేద్దాం.

అంజలి శర్వాణి: యువపేసర్ అంజలి శర్వాణిపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఆస్ట్రేలియా జట్టుపై అంజలి శర్వాణి క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు ఆమె ఆరు మ్యాచ్​లు ఆడగా మూడు వికెట్లు పడగొట్టి ఫర్వాలేదనిపించింది. తక్కువ వికెట్లే తీసినా, పొదుపుగా, మంచి స్పీడ్​తో బౌలింగ్ చేయడం అంజలి స్పెషాలిటీ. ఈమె ఈ టోర్నీలో యూపీ వారియర్స్​కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈమెను యూపీ రూ. 55లక్షలకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో అత్యధిక ధర పలికిన తెలుగు ప్లేయర్​ అంజలీయే.

అరుంధతిరెడ్డి: అరుంధతి రెడ్డి ఇప్పటికే టీమ్ఇండియాకు 26 మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించింది. డబ్ల్యూపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతోంది. ఈమెను దిల్లీ రూ.30లక్షలకు దక్కించుకుంది.

సబ్బినేని మేఘన: సబ్బినేని మేఘన బ్యాట్​తో అదరగొడుతుంది. ఇప్పటివరకు 3 వన్డేలు, 17 టి20ల్లో టీమ్ఇండియాకి ప్రాతినిధ్యం వహించింది. ఈమెను గుజరాత్ జెయింట్స్ ఫ్రాంఛైజీ రూ.30లక్షలకు కొనుగోలు చేసింది.

గౌహర్ సుల్తానా: గౌహర్ సుల్తానా టీమ్ఇండియాకు అత్యధిక మ్యాచ్​లు ఆడిన తెలుగు అమ్మాయిల్లో ఒకరు. సుల్తానా స్వస్థలం హైదరాబాద్. సల్తానా ఇప్పటివరకు 50 వన్డేలు, 37 టీ20ల్లో ఆడింది. 35ఏళ్ల వయసులో ప్రస్తుత డబ్ల్యూపీఎల్​లో యూపీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది.

యశశ్రీ: యశశ్రీని యూపీ వారియర్స్ గతేడాది రూ.10లక్షలతో కొనుగోలు చేసింది. ఆ సీజన్​లో ఒక్క మ్యాచ్​లోనే ఆడే ఛాన్స్ వచ్చింది. ఈ తర్వాత ఈ హైదరాబాదీ పేసర్​కు మరో ఛాన్స్ రాలేదు. మంచి వేగంతో బౌలింగ్ చేసే యశశ్రీ ఈసారి తనకు తగినన్ని ఛాన్సులు వస్తాయని ఆశిస్తోంది.

స్నేహదీప్తి: 16ఏళ్ల వయసులోనే టీ20 మ్యాచ్ ఆడి భారత్ తరపున ఈ ఘనత సాధించిన చిన్న వయస్కురాలిగా రికార్డు క్రియేట్ చేసింది. తర్వాత షెఫాలీ వర్మ రికార్డును బ్రేక్ చేసింది. భారత్​కు ఆడిన 2 టీ20లు, ఒక వన్డేలో ఆమె రాణించకపోవడం వల్ల చోటు కోల్పోయింది. ఇప్పుడు డబ్య్లూపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతోంది.

షబ్నం షకిల్: మీడియం పేసర్ షబ్నం షకిల్, బ్యాటర్ త్రిష పూజిత కూడా ఈ లీగ్​లో ఛాన్స్ వస్తే సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నారు. మరి వీరిలో లీగ్ ముగిసేసరికి ఎంతమంది పేర్లు మారుమోగుతాయో చూడాల్సిందే.

గెట్​రెడీ క్రికెట్​ ఫ్యాన్స్- WPL ఓపెనింగ్ సెర్మనీకి స్టార్ హీరో- ఈసారి మరింత గ్రాండ్​గా

WPL 2024కు రంగం సిద్ధం - అమ్మాయిలు రెడీగా ఉన్నారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.