Team India Road Show: టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన టీమ్ఇండియా 3 రోజుల తర్వాత గురువారం స్వదేశం చేరుకుంది. ఇక ఇవాళ ముంబయిలో భారీ రోడ్ షో ఉండనుంది. 'విక్టరీ పరేడ్' పేరుతో బీసీసీఐ ఈ ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రోడ్ షో కోసం ఓ బస్సును బీసీసీఐ ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. ఓపెన్ టాప్ బస్సుపై టీమ్ఇండియా ప్లేయర్లు రోడ్ షోలో పాల్గొననున్నారు. అయితే తాజాగా ఈ రోడ్ షోకు సంబంధించిన బస్సు రెడీ అయిపోయింది.
ర్యాలీకి వాడనున్న బస్సును అందంగా డిజైన్ చేశారు. టీమ్ఇండియా వరల్డ్‌కప్ అందుకున్న ఓ ఫొటో స్టిక్కర్‌ను బస్సుకు ఓ వైపున అతికించారు. ఈ ఫొటోలో టీమ్ఇండియా ప్లేయర్లతోపాటు, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇంకా ఇతర సిబ్బంది ఉన్నారు. ఇక 'ఛాంపియన్స్ 2024', బీసీసీఐ లోగోలు బస్సుపై ఉంచారు. కాగా, గురువారం సాయంత్రం 5 గంటలకు రోడ్ షో ప్రారంభం కానుంది. ముంబయి నారిమన్ పాయింట్ వద్ద ర్యాలీ ప్రారంభమై వాంఖడే స్టేడియం వద్ద ముగస్తుంది. ర్యాలీ డిస్టెన్స్ దాదాపు 2కిలోమీటర్లు ఉండనుంది. ఈ రోడ్ షోకు భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Team India's bus for the Parade. 🇮🇳 pic.twitter.com/ZUD2f6Lpi2
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2024
INDIAN TEAM BUS FOR THE PARADE IS GETTING READY. 🏆🇮🇳pic.twitter.com/X3E4oSYYbQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2024
కాగా, గురువారం ఉదయం దిల్లీ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న టీమ్ఇండియా ప్లేయర్లకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి స్పెషల్ బస్సులో ప్లేయర్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లారు. హోటల్ వద్ద కూడా ప్లేయర్లకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. డ్రమ్ బీట్స్‌తో హోటల్ సిబ్బంది ప్రత్యేకంగా వెల్కమ్ చెప్పింది. ఇక మౌర్య హోటల్ సిబ్బంది ప్రత్యేకంగా టీ20 ప్రపంచకప్ నమూనాలో ఓ కేక్ తయారు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య ఈ కేక్ కట్ చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఇక మోదీతో భేటీ ముగిశాక టీమ్ఇండియా ముంబయి వెళ్లనుంది.
వరల్డ్ ఛాంపియన్లు వచ్చేశారోచ్- ఎయిర్‌పోర్ట్‌లో ప్లేయర్లకు గ్రాండ్ వెల్కమ్ - T20 World Cup
డ్రమ్ బీట్‌కు అదిరే స్టెప్పులు- రోడ్డుపై రోహిత్ డ్యాన్స్- వీడియో చూశారా? - T20 World Cup 2024