ETV Bharat / sports

U-19 వ‌ర‌ల్డ్​ క‌ప్​- భారత్​ ఖాతాలో ఐదు టైటిళ్లు- టీమ్​ఇండియా సక్సెస్​ఫుల్ జర్నీ మీకు తెలుసా? - Under 19 WC Indian Team Moments

Team India Top 5 Moments In Under-19 WC: అండ‌ర్​- 19 2024 వరల్డ్​కప్​లో డిఫెండింగ్ ఛాంపియ‌న్​గా బ‌రిలోకి దిగిన టీమ్​ఇండియా ఆదివారం ఆస్ట్రేలియాతో ఫైనల్​ మ్యాచ్​ ఆడనుంది. మంచి ప్ర‌ద‌ర్శ‌న‌తో ఫైనల్స్​కు దూసుకెళ్లిన భారత్, తుది పోరులోనూ అదే దూకుడును ప్రదర్శించి కప్పును చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో అండర్​-19 టోర్నీలో ఇప్పటివరకు మన జట్టు ఆటగాళ్లు సంబంధించి టాప్ 5 మూమెంట్స్​ ఏవో ఇప్పుడు చూద్దాం.

Team India Top 5 Moments In Under-19 WC
Team India Top 5 Moments In Under-19 WC
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 1:09 PM IST

Team India Top 5 Moments In Under-19 WC: ఐసీసీ అండ‌ర్​- 19 వ‌ర‌ల్డ్ క‌ప్​ 2024 తుది ద‌శ‌కు చేరుకుంది. డిఫెండింగ్​ ఛాంపియ‌న్​గా ఉన్న భార‌త యువ జ‌ట్టు మ‌రో ట్రోఫీని గెలవ‌డ‌మే ల‌క్ష్యంగా బరిలోకి దిగనుంది. ఇప్ప‌టికే మ‌న జ‌ట్టు దక్షిణాఫ్రికాను చిత్తుచేసి ఫైన‌ల్​కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో సెమీస్​లో పాకిస్థాన్​పై ఆస్ట్రేలియా వికెట్ తేడాతో నెగ్గి ఫైనల్​కు చేరింది. ఇక భారత్- ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 11(ఆదివారం)న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే కుర్రాళ్ల కోసం నిర్వహించే ప్రపంచకప్ ఎప్పుడు మొదలైంది? అందులో భారత్ ప్రదర్శన ఎలా ఉంది? అనేవి తెలుసుకుందాం.

అండర్​-19 టోర్నమెంట్​ 1988లో ప్రారంభమైంది. ఇప్ప‌టివ‌ర‌కు 14 ఎడిష‌న్లు జ‌రిగాయి. ఇందులో 7 జ‌ట్లు విజేత‌లుగా నిలిచాయి. అండ‌ర్​- 19 చ‌రిత్ర‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్టు టీమ్​ఇండియానే కావడం విశేషం. 2000, 2008, 2012, 2018, 2022లో విజేతగా నిలిచింది. 3 సార్లు రన్నరప్‌ హోదాతో సరిపెట్టుకుంది. అంతేకాదు యువ‌రాజ్​ సింగ్​, ర‌వీంద్ర జ‌డేజా, విరాట్​ కోహ్లి లాంటి స్టార్​ ఆట‌గాళ్లు ఈ టోర్నీనుంచే వెలుగులోకి వచ్చారు. ఇలాంటి అద్భుతమైన టోర్నీలో మ‌న జ‌ట్టుకు చెందిన టాప్​- 5 మూమెంట్స్​ ఏంటంటే?

2000లో తొలి విజయం: 2000 సంవత్స‌రంలో టీమ్ఇండియా తొలిసారి అండర్-19 ట్రోఫీని ముద్దాడింది. ఫైన‌ల్లో శ్రీలంకతో తలపడ్డ భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అప్పటి టీమ్ఇండియాకు మహమ్మద్​ కైఫ్ కెప్టెన్​గా వ్యవహరించాడు.​ అదే టోర్నీ అప్పటి టీమ్ఇండియాకు యువరాజ్​ సింగ్​ను అందించింది. ఆ టోర్నీలో యువీ ఆల్​రౌండ్​ ప్రదర్శనతో ఆకట్టుకొని 'ప్లేయర్​ ఆఫ్​ ది టోర్నీ' గా ఎంపికయ్యాడు. ఇక కెప్టెన్​ కైఫ్ త‌ర్వాతి కాలంలో వరల్డ్​ క్రికెట్​లో కైఫ్​ బెస్ట్​ ఫీల్డ‌ర్​గా పేరు తెచ్చుకున్నాడు.

కింగ్​ కోహ్లి ఎంట్రీతో: 2008 వరల్డ్​కప్​ ఎడిషన్ సంచలన ఆటగాడు విరాట్ కోహ్లీని ప్రపంచానికి పరిచయం చేసింది. మ‌లేసియాలో జ‌రిగిన ఆ టోర్నీలో టీమ్ఇండియాకు విరాట్ నాయకత్వం వహించాడు. ఫైనల్​లో సౌతాఫ్రికాతో తలపడ్డ భారత్ విజయం సాధించింది. వ‌ర్షం కార‌ణంగా 25 ఓవ‌ర్లలో 116 పరుగులకే ల‌క్ష్యాన్ని కుదించారు. కానీ టీమ్​ఇండియా 103 ప‌రుగుల‌కే ద‌క్షిణాఫ్రికాను చిత్తు చేసి రెండోసారి కప్పును సొంతం చేసుకుంది.

మూడో కప్పుకు 4 ఏళ్లు: 2012 టోర్నీలో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా టైటిల్ ఫైవరెట్​దగా బరిలోకి దిగింది. అంచనాలు లేని టీమ్ఇండియా ఈ ఎడిషన్​లో అనూహ్యంగా విజ‌యాలు సాధిస్తూ ఫైన‌ల్​కు చేరింది. తుదిపోరులో కంగారూలతో తలపడిన భారత్ జయకేతనం ఎగురవేసింది. కెప్టెన్​ ఉన్ముక్త్​ చంద్​ 130 బంతుల్లో 6 సిక్సర్లు, 7 ఫోర్లతో 111 ప‌రుగులు చేసి భారత్​ను గెలిపించాడు. దీంతో నాలుగేళ్ల తర్వాత భారత్ మరోసారి ఛాంపియన్​గా నిలిచింది.

ఫలించిన ద్రవిడ్ నిరీక్షణ: 2018 అండర్ 19 జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్​గా వ్యవహరించాడు. ఈ ఎడిషన్​లో పృథ్వీషా నాయకత్వంలో బరిలోగి దిగిన భారత్ ఫైనల్​లో ఆస్ట్రేలియా జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ నెగ్గింది. ఇక తన కెరీర్​లో గెలవని వరల్డ్​కప్ ట్రోఫీని యువ ఆటగాళ్లు నెగ్గి రాహుల్​ కోచ్​కు అందించారు. దీంతో రాహుల్​ కల ఫలించినట్లైంది. ఇదే టోర్నీలో శుభ్​మన్​ గిల్​తో పాటు​ అర్షదీప్​ సింగ్ కూడా జట్టు సభ్యులు.​

భారత్ ఖాతాలో ఐదో కప్పు: 2022లో వెస్టిండీస్​ వేదిక‌గా అండ‌ర్​-19 ప్రపంచ క‌ప్​ జ‌రిగింది. టోర్న‌మెంట్​ మొత్తంలో టీమ్ఇండియా విజ‌యాలు సాధిస్తూనే వ‌చ్చింది. ఫైన‌ల్​లో బ‌ల‌మైన ఇంగ్లాండ్ జ‌ట్టుతో ఢీకొట్టింది. ఈ పోరులో ఇంగ్లీష్​ జట్టు నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా ఛేదించి ఐదోసారి ఛాంపియన్​గా నిలిచింది.

అండర్​ 19 వరల్డ్ కప్​లో ట్విస్ట్ - ఫైనల్‌కు ఆసీస్‌ x భారత్‌ ఢీ

భారత్xఆస్ట్రేలియా ఫైనల్- తెల్చుకోవాల్సిన లెక్కలెన్నో- ఈసారి దెబ్బ కొట్టాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.