ETV Bharat / sports

వరల్డ్​కప్ విన్నర్స్​ జెర్సీలో మార్పు- మీరు గమనించారా? - T20 World Cup 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 4, 2024, 12:55 PM IST

Team India Jersey: టీ20 ప్రపంచకప్ నెగ్గిన టీమ్ఇండియా ప్లేయర్లు ప్రధాని మోదీని కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆటగాళ్లు ధరించిన జెర్సీలో మార్పు కనిపించింది.

Team India Jersey
Team India Jersey (Source: Associated Press)

Team India Jersey: వరల్డ్​కప్ నెగ్గి గురువారం భారత్​కు వచ్చిన టీమ్ఇండియాకు దిల్లీ ఎయిర్ పోర్ట్​లో ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో అక్కడ్నుంచి టీమ్ఇండియా ప్లేయర్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్​కు వెళ్లారు. హోటల్​లో రీ- ఫ్రెష్ అయ్యిన అనంతరం టీమ్ఇండియా స్పెషల్ బస్సులో ప్రధాని మోదీ నివాసానికి బయల్దేరింది. అయితే మోదీ ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ప్లేయర్లంతా రెగ్యులర్ ఔట్​ఫిట్​కు బదులుగా టీమ్ఇండియా టీ20 వరల్డ్​కప్​ జెర్సీని ధరించారు. రెగ్యులర్​గా అయితే జెర్సీపై ఇండియా 'INDIA' అని మాత్రమే రాసి ఉంటుంది. కానీ, జెర్సీ ఎప్పటిలాగే కాకుండా డిఫరెంట్​గా డిజైన్ చేశారు. ఇండియాతోపాటు 'ఛాంపియన్స్​' అనే పదాన్ని చేర్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రధానితో ముగిసిన భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో టీమ్ఇండియా సమావేశం ముగిసింది. కాసేపు ప్లేయర్లతో గడిపిన మోదీ వారితో సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. జట్టుతో కలిసి మోదీ గ్రూప్ ఫొటో దిగారు. వరల్డ్​కప్ నెగ్గిన సందర్భంగా టీమ్ఇండియాను ఆయన అభినందించారు. ఇక దాదాపు గంటసేపు తర్వాత భేటీ ముగిసింది. టీమ్ఇండియా ప్లేయర్లు తిరిగి ముంబయి బయల్దేరారు. ఇక సాయంత్రం ముంబయిలో జరిగే రోడ్ షోలో టీమ్ఇండియా ప్లేయర్లు పాల్గొంటారు. ఈ రోడ్ షోకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యే ఛాన్స్ ఉంది.

#WATCH | Indian Cricket team meets Prime Minister Narendra Modi at 7, Lok Kalyan Marg.

Team India arrived at Delhi airport today morning after winning the T20 World Cup in Barbados on 29th June. pic.twitter.com/840otjWkic

— ANI (@ANI) July 4, 2024

భారీ రోడ్ షో
ముంబయిలో గురువారం సాయంత్రం రోడ్ షో ఉండనుంది. ఈ రోడ్​ షో కోసం ఓ బస్సును బీసీసీఐ ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. ఓపెన్‌ టాప్‌ బస్సుపై టీమ్ఇండియా ప్లేయర్లు రోడ్‌ షోలో పాల్గొననున్నారు. ముంబయి నారిమన్ పాయింట్ వద్ద ర్యాలీ ప్రారంభమై వాంఖడే స్టేడియం వద్ద ముగుస్తుంది. ర్యాలీ డిస్టెన్స్ దాదాపు 2కిలోమీటర్లు ఉండనుంది. ఈ రోడ్ షోకు భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ర్యాలీ అనంతరం బీసీసీఐ ఆధ్వర్యంలో వాంఖడే స్టేడియంలో ప్లేయర్లకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.

టీమ్ఇండియా 'రోడ్ షో' బస్సు రెడీ- వీడియో వైరల్- డిజైన్ అదిరిపోయిందిగా! - T20 World Cup 2024

డ్రమ్​ బీట్​కు అదిరే​ స్టెప్పులు- రోడ్డుపై రోహిత్​ డ్యాన్స్​- వీడియో చూశారా​? - T20 World Cup 2024

Team India Jersey: వరల్డ్​కప్ నెగ్గి గురువారం భారత్​కు వచ్చిన టీమ్ఇండియాకు దిల్లీ ఎయిర్ పోర్ట్​లో ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో అక్కడ్నుంచి టీమ్ఇండియా ప్లేయర్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్​కు వెళ్లారు. హోటల్​లో రీ- ఫ్రెష్ అయ్యిన అనంతరం టీమ్ఇండియా స్పెషల్ బస్సులో ప్రధాని మోదీ నివాసానికి బయల్దేరింది. అయితే మోదీ ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ప్లేయర్లంతా రెగ్యులర్ ఔట్​ఫిట్​కు బదులుగా టీమ్ఇండియా టీ20 వరల్డ్​కప్​ జెర్సీని ధరించారు. రెగ్యులర్​గా అయితే జెర్సీపై ఇండియా 'INDIA' అని మాత్రమే రాసి ఉంటుంది. కానీ, జెర్సీ ఎప్పటిలాగే కాకుండా డిఫరెంట్​గా డిజైన్ చేశారు. ఇండియాతోపాటు 'ఛాంపియన్స్​' అనే పదాన్ని చేర్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రధానితో ముగిసిన భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో టీమ్ఇండియా సమావేశం ముగిసింది. కాసేపు ప్లేయర్లతో గడిపిన మోదీ వారితో సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. జట్టుతో కలిసి మోదీ గ్రూప్ ఫొటో దిగారు. వరల్డ్​కప్ నెగ్గిన సందర్భంగా టీమ్ఇండియాను ఆయన అభినందించారు. ఇక దాదాపు గంటసేపు తర్వాత భేటీ ముగిసింది. టీమ్ఇండియా ప్లేయర్లు తిరిగి ముంబయి బయల్దేరారు. ఇక సాయంత్రం ముంబయిలో జరిగే రోడ్ షోలో టీమ్ఇండియా ప్లేయర్లు పాల్గొంటారు. ఈ రోడ్ షోకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యే ఛాన్స్ ఉంది.

భారీ రోడ్ షో
ముంబయిలో గురువారం సాయంత్రం రోడ్ షో ఉండనుంది. ఈ రోడ్​ షో కోసం ఓ బస్సును బీసీసీఐ ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. ఓపెన్‌ టాప్‌ బస్సుపై టీమ్ఇండియా ప్లేయర్లు రోడ్‌ షోలో పాల్గొననున్నారు. ముంబయి నారిమన్ పాయింట్ వద్ద ర్యాలీ ప్రారంభమై వాంఖడే స్టేడియం వద్ద ముగుస్తుంది. ర్యాలీ డిస్టెన్స్ దాదాపు 2కిలోమీటర్లు ఉండనుంది. ఈ రోడ్ షోకు భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ర్యాలీ అనంతరం బీసీసీఐ ఆధ్వర్యంలో వాంఖడే స్టేడియంలో ప్లేయర్లకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.

టీమ్ఇండియా 'రోడ్ షో' బస్సు రెడీ- వీడియో వైరల్- డిజైన్ అదిరిపోయిందిగా! - T20 World Cup 2024

డ్రమ్​ బీట్​కు అదిరే​ స్టెప్పులు- రోడ్డుపై రోహిత్​ డ్యాన్స్​- వీడియో చూశారా​? - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.