ETV Bharat / sports

టీమ్ఇండియా రిటర్న్ జర్నీకి బ్రేక్- తుపాన్ దెబ్బకు ప్లేయర్లంతా హోటల్​లోనే! - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

Team India Return: వరల్డ్​​కప్​ ఛాంపియన్స్​ భారత్ క్రికెట్ జట్టు స్వదేశం రావడానికి ఆలస్యం కానుంది. విండీస్​​లో తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. అందుకే టీమ్ఇండియా భారత్​కు తిరిగి రావడం కాస్త ఆసల్యం కానుంది.

Team India Return
Team India Return (Source: Associate Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 2:22 PM IST

Team India Return: టీ20 వరల్డ్​కప్​ ట్రోఫీ నెగ్గిన టీమ్ఇండియా స్వదేశానికి రావడం మరింత ఆలస్యం కానుంది. వెస్టిండీస్​లో హరికేన్ తుపాన్ కారణంగా భారత క్రికెట్ జట్టు బార్బడోస్‌లోనే ఉండిపోయింది. టీమ్‌ఇండియా ప్లేయర్లు ఉన్న బార్బడోస్‌తోపాటు సెయింట్‌ లూసియా, గ్రెనడా, సెయింట్‌ విన్సెంట్, గ్రెనడైన్‌ పాంత్రాల్లో తపాన్ బీభత్సం సృష్టిస్తోంది. దీంతో అక్కడి అధికారులు తుపాన్ హెచ్చరికలు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించారు.

తూపాన్ దెబ్బకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. బర్బడోస్​లోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో టీమ్ఇండియా ప్లేయర్లంతా తాము బస చేస్తున్న హోటల్​లోనే ఉండిపోయారు. బార్బడోస్‌లో కర్ఫ్యూ దృష్ట్యా భారత క్రికెట్ జట్టు స్వదేశానికి రావడం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. టీమ్ఇండియాతోపాటు మ్యాచ్‌ల కవరేజ్‌కు వెళ్లిన మీడియా కూడా బర్బడోస్​నే ఉంది.

గ్రాండ్​ వెల్​కమ్: అయితే టీమ్ఇండియాకు గ్రాండ్ వెల్​కమ్ ఇచ్చేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. వాళ్లు స్వదేశానికి చేరుకున్నాక ఘనంగా సన్మానించాలని డిసైడైంది. ప్లేయర్లు అక్కడ నుంచి బయల్దేరిన తర్వాత ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పారు.

India Tour Of Zimbabwe 2024: మరో 4 రోజుల్లో టీమ్ఇండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు వెళ్లే జట్టులో ఎంపికైన యశస్వీ జైస్వాల్‌, సంజు శాంసన్‌, ఖలీల్‌ అహ్మద్‌, రింకుసింగ్ కూడా బర్బడోస్​లో చిక్కుకపోయారు. ఒకవేళ వీరి రాక ఆలస్యమైతే వాళ్ల స్థానాలను ఇతర ప్లేయర్లతో భర్తీ చేస్తారు. కాగా, ఈ పర్యటనలో భారత్ ఆతిథ్య జింబాబ్వేతో 5 మ్యాచ్​ల టీ20 సిరీస్ ఆడనుంది.

పర్యటన షెడ్యూల్

తొలి టీ20 జూలై 6
రెండో టీ20జూలై 7
మూడో టీ20జూలై 10
నాలుగో టీ20 జూలై 13
ఐదో టీ20 జూలై 14
  • అన్ని మ్యాచ్​లకు హరారేలోని హరారే స్పోర్ట్స్​ క్లబ్ మైదానం వేదికకానుంది. అన్ని మ్యాచ్​లు భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం అవుతాయి.

భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ధృవ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్​ కుమార్, తుషార్ దేశ్​పాండే.

టీమ్ఇండియా కొత్త కోచ్ ఎంపిక పూర్తి- అనౌన్స్​మెంట్ అప్పుడేనట! - Team India New Coach

ICC టీమ్ ఆఫ్ ది టోర్నీ- రోహిత్ సహా 6గురు టీమ్ఇండియా ప్లేయర్లే - T20 World cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.