ETV Bharat / sports

టీమ్ఇండియా కొత్త కోచ్ ఎంపిక పూర్తి- అనౌన్స్​మెంట్ అప్పుడేనట! - Team India New Coach

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 9:00 AM IST

Updated : Jul 1, 2024, 9:25 AM IST

Team India New Coach: టీమ్ఇండియా హెడ్​కోచ్ పదవికి పేర్లు షార్ట్ లిస్ట్​ అయ్యాయట. ఇక జట్టుకు కోచ్​గా ఎవరు నియమితులయ్యారనన్నది త్వరలోనే తెలుస్తుందని షా అన్నారు.

Team India New Coach
Team India New Coach (Source: Associated Press)

Team India New Coach: టీమ్ఇండియా జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లేలోపే కొత్త హెడ్ కోచ్ ఎంపిక పూర్తవుతుందని బీసీసీఐ సెక్రటరీ జై షా అన్నారు. ఎంపికైన కొత్త కోచ్​తోనే భారత్ ఈ నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుందని సోమవారం జై షా ఓ సందర్భంలో చెప్పారు. కానీ, కోచ్​గా ఎవరు ఎంపికయ్యారన్నదానిపై మాత్రం జై షా క్లారిటీ ఇవ్వలేదు. ఇక కొత్త సెలక్టర్​ను కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు షా తెలిపారు. అయితే మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్​ జట్టు కోచ్​గా ఎంపిక కానున్నాడని​ కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే అతడి ఇంటర్వ్యూ కూడా రీసెంట్​గా పూర్తైంది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

'కోచ్, టీమ్ సెలక్టర్ ఎంపిక త్వరలోనే పూర్తవుతుంది. ఈ పదవులకు ఇద్దరి పేర్లు ఇప్పటికే షార్ట్​ లిస్ట్ చేశాం. ముంబయి చేరుకున్నాక మరిన్ని వివరాలు బయటపెడతాం. టీమ్ఇండియా త్వరలో జింబాబ్వే టూర్​కు వెళ్లనుంది. ఈ పర్యటనకు మాత్రం వీవీఎస్ లక్ష్మణ్ కోచ్​ (టెంపరరీ)గా వెళ్లనున్నారు, ఇక శ్రీలంక పర్యటన నాటికి కొత్త కోచ్ జట్టుతో చేరతారు' అని షా సోమవారం పేర్కొన్నారు. కాగా, జూలై 27న శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. ఈ టూర్​లో టీమ్ఇండియా ఆతిథ్య శ్రీలంకతో 3 టీ20, 3 వన్డేలు అడనుంది.

శ్రీలంక పర్యటన షెడ్యూల్

  • తొలి టీ20- జూలై 27-
  • రెండో టీ20- జూలై 28
  • మూడో టీ20- జూలై 30
  • తొలి వన్డే- ఆగస్టు 02
  • రెండో వన్డే- ఆగస్టు 04
  • మూడో వన్డే- ఆగస్టు- 07

కాగా, రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవి 2024 టీ20 వరల్డ్​కప్ టోర్నమెంట్​తో ముగిసింది. 2021 నవంబరులో కోచ్​గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ ద్రవిడ్ మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. అయితే గతేడాది 2023 వన్డే వరల్డ్​కప్​ నాటికే ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. కానీ మరో ఆరు నెలలపాటు ద్రవిడ్ ఆ పదవిలో ఉన్నారు. ఇక కొత్తగా ఎంపికయ్యే కోచ్ 2027 వన్డే వరల్డ్​కప్​ వరకూ ఆ పదవిలో ఉండనున్నారు.

కెప్టెన్​గా విఫలమైనా కోచ్​గా ద్రవిడ్ సక్సెస్​- 17ఏళ్ల తర్వాత అదే గడ్డపై కప్పు సొంతం! - T20 World Cup 2024

టీమ్ఇండియా కోచ్ ఎంపికలో ట్విస్ట్- గంభీర్​తోపాటు 'అతడు' కూడా! - Team India New Coach

Last Updated : Jul 1, 2024, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.