Team India Meet PM Modi : 2023 నవంబర్ 19న టీమ్ఇండియాకు ఊహించని ఫలితం ఎదురైంది. అజేయంగా ఫైనల్ చేరిన రోహిత్ సేన, ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరిపోరులో ఓటమిచవి చూసింది. కప్పు గెలుస్తుందని ఎదురు చూస్తున్న కోట్ల మంది భారతీయులకు నిరాశ తప్పలేదు. ఆటగాళ్లు కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఆ సమయంలో ప్లేయర్స్‌ను ఓదార్చడానికి, ఇండియా మీ వెంటే ఉందని చెప్పడానికి మోదీ వెళ్లారు.
Unfortunately yesterday was not our day. I would like to thank all Indians for supporting our team and me throughout the tournament. Thankful to PM @narendramodi for specially coming to the dressing room and raising our spirits. We will bounce back! pic.twitter.com/Aev27mzni5
— 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) November 20, 2023
ఆ కష్ట సమయంలో మోదీ ప్లేయర్లకు అండగా నిలిచారు. ప్రతి ప్లేయర్ వద్దకు వెళ్లి పేరుపేరున పలకరించి ఓదార్చారు. దగ్గరకు తీసుకుని వాళ్ల కన్నీళ్లు తుడిచారు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. మీరు ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలని కోరారు.
సరిగ్గా 8 నెలల తర్వాత మన ప్లేయర్లను మోదీని కలిశారు. ఈ సారి టీ20 ప్రపంచ కప్ విజేతలుగా ఆయన ముందు నిలిచారు. దీంతో అప్పుడు కౌగిలించుకుని ఓదార్చిన ఆయనే, ఇప్పుడు భుజం తట్టి అభినందించారు. ప్రతి ప్లేయర్‌ను ప్రత్యేకంగా పలకరించి వాళ్ల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సరదాగా ముచ్చటించి టోర్నీ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్‌తో కలిసి ట్రోఫీని పట్టుకుని మొత్తం ఆటగాళ్లు, టీమ్ స్టాఫ్‌తో కలిసి ప్రధాని ఫోటో దిగారు.
An excellent meeting with our Champions!
— Narendra Modi (@narendramodi) July 4, 2024
Hosted the World Cup winning team at 7, LKM and had a memorable conversation on their experiences through the tournament. pic.twitter.com/roqhyQRTnn
ఈ విజయం వారికి ప్రత్యేకం
భిన్నమైన పరిస్థితుల్లో టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్‌లో అడుగు పెట్టింది. 2013 నుంచి మన ఖాతాలో ఒక్క ఐసీసీ ట్రోఫీ లేదు. గతేడాది రెండు ఐసీసీ ఫైనల్స్‌లోనూ ఓడింది.
కోచ్ ద్రవిడ్‌కి చివరి టోర్నీ. సీనియర్లు రోహిత్, కోహ్లి, రవీంద్ర జడేజా, బుమ్రా వంటి సీనియర్లకి మరో అవకాశం ఉంటుందో లేదోననే సందేహం. ఇన్ని రకాల ఎమోషన్స్‌తో టీమ్ ఇండియా టోర్నీ ప్రారంభించింది. పిచ్ ఎలా ఉన్నా పోరాడి, ప్రత్యర్థి ఎవరైనా సరే ఓడించి, టీమ్ఇండియా ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ కలను నెరవేర్చింది.
ఈ టోర్నీకి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే కరీబియన్ వేదికగా 2007లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ద్రవిడ్ నేతృత్వంలోనే భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. కానీ ఇప్పుడు అదే వేదికపై కోచ్‌గా ఆయన టీమ్ఇండియాకు అండగా నిలిచి కప్పు గెలిపించారు. ఇన్నేళ్లు తనకున్న కలను నెరవేర్చుకుని తానేంటో నిరూపించుకున్నాడు.
'ఐయామ్ సారీ' - హార్దిక్‌కు క్షమాపణలు చెబుతున్న ముంబయి ఫ్యాన్స్ - Mumbai Fans Sorry To Hardik
టీమ్‌ఇండియాతో మోదీ స్పెషల్ చిట్‌చాట్ - ఏం ప్రశ్నలు అడిగారో తెలుసా? - Teamindia Modi Chit Chat