Team India 16 hours Journey: టీ 20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి విశ్వ విజేతలుగా నిలిచిన భారత ఆటగాళ్లు బార్బడోస్ నుంచి 16 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత గురువారం స్వదేశంలో అడుగు పెట్టారు. ఈ నెల 29న ప్రపంచకప్‌ను గెలిచిన తర్వాత తుపాను కారణంగా 5రోజులు అక్కడే ఉన్న టీమ్ఇండియా ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం బయల్దేరింది. అయితే ఈ 16 గంటల ప్రయాణంలో విమానంలో భారత ఆటగాళ్లు చిన్నపిల్లల్లా సందడి చేశారు.
ప్రపంచకప్పును తనివితీరా చూస్తూ ఓ వైపు మురిసిపోతూనే మరోవైపు దాన్ని సాధించేందుకు పడిన కష్టాన్ని గుర్తుచేసుకొని ఎమోషనలయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ చిన్నపిల్లాడిలా విమానంలో సందడి చేశాడు. మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్ ఆ కప్పును తమ సీటు పక్కనే పెట్టుకుని అలా చూస్తూ ఉండిపోయారు.
ఇక విరాట్ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. పంత్ ఆ ట్రోఫీతో డ్యాన్స్ చేశాడు. ఇక పేసర్ జస్ర్పీత్ బుమ్రా తన కుమారుడు అంగద్ బుమ్రాకు ట్రోఫీని చూపుతూ మురిసిపోయాడు. మహ్మద్ సిరాజ్ కప్పును చూస్తూ దాన్ని సాధించేందుకు తాము ఎంత కష్టపడ్డామో చెప్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ ప్రపంచకప్‌ను సాధించిన జట్టులో భాగస్వామిని కావడం తన అదృష్టమని సిరాజ్ అన్నాడు. అర్షదీప్ కుమార్ కూడా తమ తల్లిదండ్రులతో కలిసి ఓ స్పెషల్ ఫొటో తీసుకున్నాడు. ఇలా ప్లేయర్లందరూ ఆ కప్‌తో తమ స్పెషల్ మూమెంట్స్ పంచుకున్నారు. ఇదంతా రికార్డు చేసిన బీసీసీఐ టీమ్ ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా క్రికెట్ అభిమానుల కోసం షేర్ చేసింది.
ఇక ఈ వీడియో చూసి ఫ్యాన్స్ కూడా తెగ మురిసిపోతున్నారు. తమ ప్లేయర్లు పడ్డ కష్టాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. 'వెలకమ్ హోమ్ ఛాంపియన్స్', 'కంగ్రాజ్యూలేషన్స్', యూ డిసర్వ్ ద విన్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. పలువురు ఫ్యాన్స్ తమ ఫేవరెట్ ప్లేయర్ల రికార్డులను ట్రెండ్ చేస్తున్నారు. స్పెషల్ మూమెంట్స్‌ను స్క్రీన్‌షాట్ తీసి నెట్టింట షేర్ చేస్తున్నారు.
Travelling with the prestigious 🏆 on the way back home! 😍
— BCCI (@BCCI) July 4, 2024
🎥 WATCH: #TeamIndia were in excellent company during their memorable travel day ✈️👌 - By @RajalArora #T20WorldCup pic.twitter.com/0ivb9m9Zp1
క్రికెట్ ఫ్యాన్స్ ఇది విన్నారా? వాంఖడేకు ఫ్రీ ఎంట్రీ
ప్రధానితో రోహిత్ సేన భేటి - ప్లేయర్లతో మోదీ సరదా ముచ్చట - Team India Meets PM Modi