ETV Bharat / sports

ఫైనల్ మ్యాచ్​కు సుధీర్- స్టేడియం వద్ద ఫుల్ రష్- టీమ్ఇండియా ఫ్యాన్స్​ తగ్గేదేలే! - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

Ind vs Sa Final 2024: 2024 టీ20 వరల్డ్​కప్ టైటిల్ ఫైట్ మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాకు మద్దతుగా అనేక మంది ఫ్యాన్స్​ బర్బడోస్ స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు.

Ind vs Sa Final 2024
Ind vs Sa Final 2024 (Source: ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 7:10 PM IST

Ind vs Sa Final 2024: 2024 టీ20 వరల్డ్​కప్​ తుది సమరానికి సమయం ఆసన్నమైంది. మరి కొన్ని నిమిషాల్లో టైటిల్ ఫైట్ ప్రారంభం కానుంది. బర్బడోస్ వేదికగా భారత్- సౌతాఫ్రికా జట్లు టీ20 వరల్డ్​కప్​ ట్రోఫీ కోసం తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాకు మద్దతుగా నిలిచేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో బర్బడోస్ స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో టీమ్ఇండియా ఫ్యాన్స్​ మైదానం వద్దకు చేరుకోవడం వల్ల బర్బడోస్​ ప్రాంతం కోలాహలంగా మారింది.

టీమ్ఇండియా జెర్సీలు ధరించి, భారత జాతీయ పతాకంతో స్టేడియం వద్ద సందడి చేస్తున్నారు. ప్లకార్డులు, ప్లేయర్ల ఫొటోలు పట్టుకొని 'జీతేగా బై జీతేగా ఇండియా జీతేగా', 'భారత్ మాతా జీ కై' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారత్ ఈసారి కచ్చితంగా వరల్డ్​కప్​ టైటిల్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆటకు వర్షం అంతరాయం కలిగించవద్దని కోరుకుంటున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ డైహార్డ్ ఫ్యాన్ సుధీర్​ కూడా బర్బడోస్​కు చేరుకున్నారు. భారత్ 2007నాటి విజయాన్ని ఈరోజు రిపీట్ చేస్తుందని అశించారు.

ఫైనల్‌లో భారత్ గెలిస్తే రోహిత్ శర్మ నెలకొల్పే రికార్డులు

  • ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకుంటాడు.
  • అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ ఇప్పటివరకు 61 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. ఇందులో భారత్‌ 49 మ్యాచ్‌ల్లో గెలిచింది.
  • ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 50 విజయాలు సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డుల్లోకెక్కుతాడు.
  • అంతేకాకుండా ఓటమి అనేదే లేకుండా (100 శాతం విజయాలు) టీ20 ప్రపంచ కప్‌ సాధించిన తొలి కెప్టెన్‌గానూ రికార్డు సృష్టిస్తాడు.
  • రెండుసార్లు టీ20 ప్రపంచ కప్‌ అందుకున్న తొలి భారత ఆటగాడిగానూ హిట్‌మ్యాన్‌ నిలుస్తాడు. 2007లో భారత్ టీ20 ప్రపంచ కప్‌ సాధించిన జట్టులో రోహిత్‌ సభ్యుడిగా ఉన్నాడు.

తుదిజట్లు అంచనా

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషభ్‌ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య , రవీంద్ర జడేజా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్‌ యాదవ్, జస్క్పీత్ బుమ్రా.

సౌతాఫ్రికా: క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, అన్రిచ్ నోకియా, తంబ్రెజ్ షంసి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.