Virat Kohli RCB Captain: ఐపీఎల్ హిస్టరీలో స్టార్ ప్లేయర్‌లకు కొదవలేకపోయినా దురదృష్టవశాత్తు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క ట్రోఫీ కూడా అందుకోలేకపోయింది. 17వ సీజన్ కూడా పేలవంగానే ప్రారంభించిన ఆర్సీబీ, అనంతరం పుంజుకుంది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ సీజన్లో ఫుల్ ఫామ్‌లో ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీమ్‌కి విజయాలల్లో కీ రోల్ పోషిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో కోహ్లీపై టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీ మళ్లీ ఆర్సీబీ జట్టు పగ్గాలు అందుకోవాలని, రాబోయే సీజన్లో జట్టకు సారథ్యం వహించాలని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. 2024 ఐపీఎల్‌లో RCB మొదటి ఏడు మ్యాచుల్లో ఒక్క విజయమే సాధించి ఎలిమినేషన్ అంచన నిల్చున్న జట్టు, సెకండ్ హాఫ్‌లో వరుస విజయాలు నమోదు చేసింది.
ఆ సత్తా కోహ్లీకి ఉంది
ఆర్సీబీ క్వాలిఫైయర్స్‌లోకి అడుగుపెట్టినా, వచ్చే ఏడాది మెగా వేలానికి ముందు జట్టులో భారీ మార్పు జరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, కోహ్లీ మరోసారి కెప్టెన్సీ అందుకోవాలని, ఆర్సీబీని లీడ్ చేయడానికి ఇండియన్ ప్లేయర్ అవసరమని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. 'ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కి చేరకపోతే, ఎవరైనా ఇండియన్ ప్లేయర్‌ని కెప్టెన్ చేయాలి. విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్‌గా ఎందుకు తీసుకురాకూడదు. ధోనీ ప్రభావం చెన్నై సూపర్ కింగ్స్‌పై ఉన్నట్లే, ఆర్సీబీపై విరాట్ ఇంపాక్ట్ తప్పకుండా ఉంటుంది. విరాట్ మంచి కెప్టెన్ కూడానూ. ఎలాంటి క్రికెట్ ఆడాలో అతడికి తెలుసు. ఇప్పుడు ఆర్సీబీ చాలా దూకుడుతో ఆడుతోంది. అది విరాట్ కోహ్లీ తీసుకురాగలడు. విరాట్ కోహ్లీ ఆర్సీబీని నడిపించాలని కోరుకుంటున్నా' అని అన్నాడు.
ప్లేఆఫ్స్‌కి ఆర్సీబీ చేరుతుందా?: ఆర్సీబీ 13 మ్యాచుల్లో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే, తమ చివరి లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించాలి. అలానే దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సమీకరణాలు కూడా ఆర్సీబీకి అనుకూలంగా ఉండాలి. ఇక ఈ సీజన్లో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న విరాట్ ఇప్పటివరకు 13 మ్యాచ్‌ల్లో 661 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ ఉంది.
అంపైర్‌పై కోహ్లీ మళ్లీ ఫైర్ - ఈ సారి ఏం జరిగిందంటే? - IPL 2024