Rohit Sharma Dance: టీ20 వరల్డ్‌కప్ విజేత టీమ్ఇండియా గురువారం స్వదేశానికి చేరుకుంది. గురువారం ఉదయం 7 గంటలకు ప్లేయర్లంతా దిల్లీ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. విశ్వ వేదికపై భారత్‌ను విజేతగా నిలిపిన ఛాంపియన్లకు క్రికెట్ ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఇక ప్రత్యేక బస్సులో అక్కడ్నుంచి టీమ్ఇండియా ప్లేయర్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లారు.హోటల్ వద్ద కూడా ప్లేయర్లకు గ్రాండ్ వెల్కమ్ లభించింది.
బ్యాండ్ చప్పుళ్లు, సంప్రదాయ నృత్యాలతో టీమ్ఇండియాకు హోటల్ సిబ్బంది స్వాగతం పలికింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ సంబరాలు రెట్టింపు అయ్యాయి. బస్సు దిగి హోటల్‌కు నడుస్తున్న క్రమంలో రోహిత్ బ్యాండ్ చప్పుళ్లకు స్టెప్పులేశాడు. కాసేపు హుషారుగా డ్యాన్స్ చేస్తూ అక్కడున్న వారందరిలో జోష్ నింపాడు. ఇక సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ కూడా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
Rohit Sharma Hates dancing in public 🤣
— ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) July 4, 2024
WC win made him dance is the biggest NEWS so far 😭😭pic.twitter.com/P3qY298AqH
అంతేకాకుండా హోటల్ సిబ్బంది ప్రత్యేకంగా టీ20 వరల్డ్‌కప్ నమూనాలో ఓ కేక్ తయారు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య ఈ కేక్ కట్ చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఇక మోదీతో భేటీ ముగిశాక టీమ్ఇండియా ముంబయి వెళ్లనుంది. ఇవాళ సాయంత్రం ముంబయిలో రోడ్ షో ఉండనుంది. ఈ క్రమంలో రోడ్ షో కోసం ఓ బస్సును బీసీసీఐ ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. ఓపెన్ టాప్ బస్సుపై టీమ్ఇండియా ప్లేయర్లు రోడ్ షోలో పాల్గొననున్నారు. ముంబయి నారిమన్ పాయింట్ వద్ద ర్యాలీ ప్రారంభమై వాంఖడే స్టేడియం వద్ద ముగస్తుంది.
WATCH : Suryakumar Yadav's Bhangra dance move after T20 WC 2024 Champions Team India Arrive in Delhi.#SuryakumarYadav#ITCMaurya #TeamIndia #Champions #IndiaWinWorldCup #IndianCricketTeam #WorldCupWinner #T20WorldCup2024 #T20WorldCupFinal #T20WorldCup #DelhiAirport #T20Cricket pic.twitter.com/tgx6K2dx0c
— Vinay Uteriya (@VinayUteriya11) July 4, 2024
Virat Kohli smiling and Hardik Pandya dancing when they reach India with the Trophy.🥹
— Tanuj Singh (@ImTanujSingh) July 4, 2024
- THIS IS BEAUTIFUL. ❤️ pic.twitter.com/1OONnF3zzJ
ర్యాలీ డిస్టెన్స్ దాదాపు 2కిలోమీటర్లు ఉండనుంది. ఈ రోడ్ షోకు భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ర్యాలీ అనంతరం బీసీసీఐ ఆధ్వర్యంలో వాంఖడే స్టేడియంలో ప్లేయర్లకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.
టీమ్ఇండియా 'రోడ్ షో' బస్సు రెడీ- వీడియో వైరల్- డిజైన్ అదిరిపోయిందిగా! - T20 World Cup 2024
వరల్డ్ ఛాంపియన్లు వచ్చేశారోచ్- ఎయిర్‌పోర్ట్‌లో ప్లేయర్లకు గ్రాండ్ వెల్కమ్ - T20 World Cup