ETV Bharat / sports

T20 ప్రపంచకప్ 2026కు అర్హత సాధించిన 12 జట్లు ఇవే - T20 WorldCup 2026 - T20 WORLDCUP 2026

T20 WorldCup 2026 Qualified Teams : టీ20 ప్రపంచకప్​ 2026 కోసం 12 జట్లు అర్హత సాధించాయి. అవేంటంటే?

Source The Associated Press
T20 WorldCup 2026 Qualified Teams (Source The Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 7:25 AM IST

T20 WorldCup 2026 Qualified Teams : ప్రస్తుతం యూఎస్​ఏ, వెస్టిండీస్​లో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2024 తర్వాత జరగబోయే 2026 ప్రపంచకప్​ ఎంతో కీలకం. అయితే భారత్​, శ్రీలంక వేదికగా జరగబోయే ఈ టీ20 ప్రపంచ కప్​నకు అర్హత సాధించే జట్లు ఏవో తెలిసిపోయాయి. 2026 టీ20 ప్రపంచ కప్​ కూడా ప్రస్తుత ఎడిషన్​లాగే 20 జట్లతో జరగనుంది. ఇందులో 12 టీమ్స్​ డైరెక్ట్​గా అర్హత సాధించగా మిగతా ఎనిమిది బెర్త్‌లు కోసం క్వాలిఫయర్‌ పోటీల ద్వారా ఖరారు చేయనున్నారు.

ప్రస్తుతం ఈ ప్రపంచ కప్​(2024)లోని మొదటి రౌండ్​లోనే పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు నిష్క్రమించాయి. భారత్‌, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​, ఆఫ్గానిస్థాన్​, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ సూపర్ 8కు అర్హత సాధించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ చివరి నిమిషంలో ఈ తదుపరి దశకు వెళ్లింది. ఇప్పుడీ 8 క్వాలిఫయింగ్​ జట్లే నేరుగా 2026 టి20 ప్రపంచ కప్​నకు నేరుగా అర్హత సాధించాయి. ఇక ఆతిథ్య దేశ హోదాలో లంక తొమ్మిదో జట్టుగా అర్హత సాధిస్తుంది.

మిగతా మూడు బెర్త్​లు జూన్ 30 నాటికి ఉన్న ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం ప్రపంచ కప్​ జరుగుతుండడంటో ఈ టోర్నీ రిజల్ట్స్​ ర్యాంకింగ్స్‌ను ఎలాంటి ప్రభావితం చేయవు. దీంతో ప్రస్తుతమున్న ర్యాంకింగ్సే జూన్‌ 30 వరకు కొనసాగుతాయి. అంటే ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో ఉన్న భారత్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, ఇంగ్లాండ్​, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్​, ఐర్లాండ్‌ వరుసగా ఒకటి నుంచి పదకొండు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ ప్రస్తుతం ఆరో స్థానంలో, పాకిస్థాన్ ఏడో స్థానంలో, ఐర్లాండ్ పదకొండో స్థానంలో ఉన్నాయి.

ఈ లెక్కన ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సూపర్‌-8కు చేరకుండానే నిష్క్రమించిన న్యూజిలాండ్‌, పాకిస్థాన్​, ఐర్లాండ్‌ నెక్ట్స్​ ఎడిషన్​కు అర్హత సాధిస్తాయి. మిగతా ఎనిమిది బెర్త్‌లు క్వాలిఫయర్‌ పోటీల ద్వారా నిర్ణయిస్తారు.

ఇకపోతే 2024 ప్రపంచకప్​ విషయానికొస్తే ప్రస్తుతం సూపర్ 8 కోసం సన్నద్ధమవుతోంది. ఇందులో టీమ్​ఇండియా షెడ్యూల్​ వివరాలు ఇలా ఉన్నాయి.

  • బార్బడోస్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జూన్ 20న మ్యాచ్‌ జరగనుంది.
  • ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో జూన్ 22న పోటీపడనుంది.
  • సెయింట్‌ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో జూన్ 24న మ్యాచ్‌ ఆడనుంది.
  • టీమ్‌ఇండియా మ్యాచులన్నీ మన కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి.

ఫెర్గ్యూసన్ వరల్డ్​రికార్డ్- 4 ఓవర్లూ మెయిడెన్లే- 3 వికెట్లు కూడా

సూపర్-8కు చేరుకున్న జట్లు ఇవే- టీమ్ఇండియా ఎవరితో తలపడనుందటే? - T20 world cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.