ETV Bharat / sports

న్యూజిలాండ్ ఖేల్ ఖతం! - సూపర్ 8కు దూసుకెళ్లిన వెస్టిండీస్ - T20 Worldcup 2024

T20 Worldcup 2024 West Indies VS Newzealand : టీ20 ప్రపంచకప్‌ 2024లో వెస్టిండీస్‌ సూపర్‌ 8కు దూసుకెళ్లింది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందిన కరేబియన్లు హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయంతో గ్రూప్‌ సీ నుంచి సూపర్ 8కు అర్హత సాధించిన మొదటి జట్టుగా ఆతిథ్య వెస్టిండీస్‌ నిలిచింది. ఇక ఓటమిని అందుకున్న కివీస్​ సూపర్ 9 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.

Source ANI
T20 Worldcup 2024 West Indies VS Newzealand (Source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 12:23 PM IST

Updated : Jun 13, 2024, 12:33 PM IST

T20 Worldcup 2024 West Indies VS Newzealand : టీ20 ప్రపంచకప్‌ 2024లో వెస్టిండీస్‌ సూపర్‌ 8కు దూసుకెళ్లింది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందిన కరేబియన్లు హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయంతో గ్రూప్‌ సీ నుంచి సూపర్ 8కు అర్హత సాధించిన మొదటి జట్టుగా ఆతిథ్య వెస్టిండీస్‌ నిలిచింది. ఇక ఓటమిని అందుకున్న కివీస్​ సూపర్ 9 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే - సాధారణంగా ఐసీసీ టోర్నీలు అంటే కివీస్​ అద్భుత ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది . కానీ ఈసారి టీ20 వరల్డ్​ కప్​లో తేలిపోయింది. మొదటి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ చేతిలో ఘోర పరాజయం అందుకుంది. కీలకమైన రెండో మ్యాచ్‌లోనూ ఓటమిని చూసింది. ఆతిథ్య దేశం విండీస్‌పై పరాజయాన్ని అందుకుంది. అలా వరుసగా రెండు ఓటములతో సూపర్ 8 అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది.

తాజాగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్​కు దిగిన విండీస్​ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. షెర్ఫానె రూథర్‌ఫోర్డ్ (39 బంతుల్లో 68) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగితా కరేబియన్‌ బ్యాటర్లు అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ 3 వికెట్లు, సౌథీ, ఫెర్గూసన్‌ తలో రెండు వికెట్లు, నీషమ్‌, శాంట్నర్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇక 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 139/9 స్కోరుకే పరిమితమైంది. 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. గ్లెన్‌ ఫిలిప్స్ (40), మిచెల్ సాంట్నర్ (12 బంతుల్లో 3 సిక్స్‌ల సాయంతో 21 నాటౌట్:), ఫిన్‌ అలెన్ (26) పోరాడినా ఓటమి తప్పలేదు. అల్జారీ జోసెఫ్‌ (4/19), మోతీ (3/25) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో న్యూజిలాండ్​ను అడ్డుకున్నారు.

ప్రస్తుతం గ్రూప్ - సీలో వెస్టిండీస్​ 3 మ్యాచుల్లో 6 పాయింట్లు(+2.596 నెట్‌రన్‌రేట్‌), అఫ్గానిస్థాన్‌ రెండు మ్యాచుల్లో 4 పాయింట్లు( +5.225 నెట్‌రన్‌రేట్‌) మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఒకవేళ కివీస్‌ (-2.425) తన చివరి మ్యాచుల్లోనూ గెలిచినా అఫ్గాన్‌ రన్‌రేట్‌ను అధిగమించడం కష్టమే.

అలా చేసినందుకు యూఎస్​పై జరిమానా - 5 పరుగుల పెనాల్టీ ఏంటంటే? - T20 World Cup 2024

టీమ్​ఇండియా మెన్స్‌ టీమ్‌ స్టాఫ్‌లో ఉన్న ఏకైక మహిళ - ఎవరంటే? - Rajal Arora BCCI

Last Updated : Jun 13, 2024, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.