ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్‌ - ఆసక్తికరంగా సమీకరణాలు - T20 Worldcup 2024 - T20 WORLDCUP 2024

T20 Worldcup 2024 : టీ20 ప్రపంచకప్‌ 2024లో సూపర్‌-8 పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. గ్రూప్‌-1లో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. పూర్తి వివరాలు స్టోరీలో

source ANI
T20 Worldcup 2024 (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 7:50 AM IST

T20 Worldcup 2024 Semi Final : టీ20 ప్రపంచకప్‌ 2024లో సూపర్‌-8 రసవత్తరంగా కొనసాగుతోంది. గ్రూప్‌-1లో ఆసీస్​ జట్టుపై అఫ్గాన్​ సంచలన విజయం సాధించడంతో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన టీమ్​ ఇండియా దాదాపుగా సెమీస్‌ చేరినట్లే! ఈ నేపథ్యంలో సోమవారం(జూన్ 24) టీమ్‌ఇండియాతో మ్యాచ్‌ ఆస్ట్రేలియాకు చావోరేవో లాంటిదనే చెప్పాలి. గెలిస్తే 4 పాయింట్లతో రేసులో ఉంటుంది. బంగ్లాదేశ్‌ చేతిలో అఫ్గానిస్థాన్‌ ఓడితే టీమ్​ ఇండియా, ఆస్ట్రేలియా సెమీస్‌ చేరుతాయి.

ఒకవేళ అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా గెలిస్తే అప్పుడు వీటితో పాటు టీమ్​ఇండియా కూడా 4 పాయింట్లతో సమంగా నిలుస్తుంది. ఆ పరిస్థితిలో నెట్‌ రన్‌రేట్‌ కీలకం అవుతుంది. ప్రస్తుతం టీమ్​ ఇండియా 2.425 రన్‌రేట్​తో ఉంది. అఫ్గానిస్థాన్‌ -0.650 కన్నా ఆస్ట్రేలియా 0.223 రన్‌రేట్‌ మెరుగ్గా ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా ఓడిపోయినా రేసులో ఉంటుంది. కానీ ఆ జట్టు ముందడుగు వేయాలంటే బంగ్లాదేశ్ చేతిలో అఫ్గానిస్థాన్​ ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగానే ఆస్ట్రేలియా ముందడుగు వేస్తుంది.

T20 Worldcup 2024 Group 2 Semifinal Race : మరోవైపు గ్రూప్‌-2లో సెమీస్‌ లక్ష్యంగా సౌతాఫ్రికా, ఆతిథ్య జట్టు విండీస్​ తలపడుతున్నాయి. ఈ గ్రూప్‌ నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్‌ జట్టు సెమీస్​కు అర్హత సాధించగా సౌతాఫ్రికా, విండీస్​ మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకుంటుంది. ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది. ఇంగ్లాండ్‌ జట్టు చేతిలో ఓడిపోయిన వెస్టిండీస్ టీమ్​ ఆ తర్వాత అమెరికాపై భారీ విజయంతో రేసులో నిలిచింది. ప్రస్తుతం రెండు పాయింట్లతో ఉన్న ఆ జట్టుకు మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ 1.814 ఉంది. కాబట్టి సఫారీలను ఓడిస్తే పాయింట్లలో సమమైనా, నెట్‌ రన్‌రేట్‌లో మెరుగ్గా ఉండడం వల్ల ఆ జట్టుకే సెమీస్‌ బెర్తు ఖరారవుతుంది. వెస్టిండీస్ జట్టు ఓడితే గ్రూప్‌ నుంచి అగ్రస్థానంతో దక్షిణాఫ్రికా ముందడగు వేస్తుంది. చూాడాలి మరి ఏం జరుగుతుందో.

క్రిస్‌ జోర్డాన్ హ్యాట్రిక్ వికెట్స్​ - ఇంగ్లాండ్​కు సెమీస్ బెర్త్ ఖాయం - T20 World Cup 2024

ఇంట్రెస్టింగ్​గా వరల్డ్​కప్ సెమీస్ రేస్- ​భారత్​కు ఛాన్స్ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.