ETV Bharat / sports

రోహిత్ కెప్టెన్​ ఇన్నింగ్స్​, బుమ్రా మ్యాజిక్​ - మ్యాచ్ హైలైట్​ వీడియోస్​ చూశారా? - T20 Worldcup 2024 Semifinal

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 12:10 PM IST

T20 Worldcup 2024 Semifinal : సెమీఫైనల్​లో ఇంగ్లాండ్‌ను ఓడించడంలో టీమ్‌ఇండియా బ్యాటర్లతోపాటు బౌలర్ల కృషి ఉంది. ఫీల్డింగ్‌లో అదరగొట్టేశారు. మ్యాచ్ హైలైట్స్ వీడియోస్ చూసేద్దాం.

source The Associated Press
T20 Worldcup 2024 Semifinal (source The Associated Press)

T20 Worldcup 2024 Semifinal : టీ20 ప్రపంచకప్​ 2024లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన సెమీఫైనల్​లో విజయం సాధించి ఫైనల్​కు దూసుకెళ్లింది టీమ్​ఇండియా. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి గెలిచింది. ఈ పోరులో బుమ్రా షాకింగ్‌ డెలివరీలతో మంచిగా రాణించాడు. అక్షర్ పటేల్​, కుల్దీప్ యాదవ్​ కూడా తామేం తక్కువ కాదంటూ అదరగొట్టారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ అయితే తన బ్యాట్​కు పని చెప్పి మంచిగా ఆడాడు. మొత్తంగా టీమ్​ అంతా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. దీంతో దాదాపు 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు టీమ్​ఇండియా ముందు మంచి అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హైలైట్స్​ వీడియోల చూసేద్దాం.

లాస్ట్ వికెట్​ - ఈ మ్యాచ్​లో ఆర్చర్‌ను ఔట్‌ చేసి టీమ్​ఇండియాకు విజయాన్ని అందించాడు బుమ్రా. వాస్తవానికి అంపైర్‌ ఔట్ ఇచ్చినప్పటికీ ఇంగ్లాండ్‌ డీఆర్‌ఎస్‌ కోరింది. కానీ సమీక్షలో టీమ్​ఇండియాకు అనుకూలంగా రిజల్ట్ వచ్చింది. దీంతో ఇంగ్లాండ్‌ ఓడి ఇంటిముఖం పట్టింది.

కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ - రోహిత్ శర్మ ఈ ప్రపంచకప్​లో కెప్టెన్​గానే కాకుండా బ్యాటర్​గానూ రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియాపై 92 పరుగులు చేసిన అతడు ఇంగ్లాండ్‌పైనా హాఫ్​సెంచరీ (57) బాది ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని ఉంచడంలో కీలకంగా వ్యవహరించాడు.

సిక్స్‌ బాది ఔటైన విరాట్ - ప్రస్తుత ప్రపంచ కప్‌లో టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సరిగ్గా రాణించలేకపోయాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్​లోనూ ఫెయిల్ అయ్యాడు. అయితే ఓ మ్యాచ్​లో సిక్స్‌ బాది ఊపులోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ ఆ తర్వాత బంతికే బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

ఇంగ్లాండ్ కెప్టెన్‌ దూకుడుకు కళ్లెం - మ్యాచ్​ దూకుడు ప్రదర్శన కనబరిచాడు జోస్ బట్లర్‌. అయితే అతడి దూకుడుకు కళ్లెం వేశాడు అక్షర్ పటేల్. లెగ్‌సైడ్‌ వేసిన బాల్​ను ఆడబోయి వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు బట్లర్. అక్కడి నుంచి ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ గాడి తప్పింది.

ఒకే ఓవర్‌లో రెండు సిక్స్‌లు, రెండు వికెట్లు - క్రిస్‌ జోర్డాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్‌ పాండ్య రెండు సిక్స్‌లు బాదాడు. కానీ ఆ తర్వాత మరో భారీ షాట్‌కు ప్రయత్నించి సామ్‌ కరన్‌ చేతికి చిక్కాడు. అయితే అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన శివమ్‌ దూబె (0) గోల్డెన్‌ డక్‌ అయ్యాడు.

బుమ్రా దెబ్బకు ఫిల్‌ సాల్ట్ షాక్ - బుమ్రా బౌలింగ్​కు టాప్ బౌలర్లంతా జాగ్రత్తగా ఆడుతుంటారు. కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించినా వికెట్‌ సమర్పించుకోవాల్సి వస్తుంది. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్‌ సాల్ట్‌కు ఇదే ఎదురైంది. బుమ్రా బౌలింగ్ చేసిన ఇన్‌స్వింగర్‌ను ఆడబోయి క్లీన్‌ బౌల్డ్​ అయ్యాడు.

సూపర్ ఫీల్డింగ్‌ - టీమ్​ఇండియా ఫీల్డర్లు అద్భుతంగా ఆడారు. రెండు కీలక వికెట్లను రనౌట్‌ రూపంలో పడగొట్టారు. మొదట లివింగ్‌స్టోన్ ఆ తర్వాత కాసేపటికే అదిల్ రషీద్ పెవిలియన్‌కు చేరారు.

రోహిత్ ఆనందభాష్పాలు - నవ్వించిన కోహ్లీ!

కోహ్లీ ఫామ్​పై రోహిత్ కీలక కామెంట్స్​ - ఏం అన్నాడంటే? - T20 Worldcup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.