ETV Bharat / sports

దెబ్బకు దెబ్బ - ఇంగ్లాండ్ చిత్తు, ఫైనల్​కు టీమ్​ఇండియా - T20 Worldcup 2024 Final

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 6:23 AM IST

Updated : Jun 28, 2024, 6:48 AM IST

T20 Worldcup 2024 Semifinal : టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్​కు దూసుకెళ్లింది టీమ్​ఇండియా. సెమీస్​లో ఇంగ్లాండ్​ను చిత్తుగా ఓడించి 2022 పొట్టి ప్రపంచకప్​ సెమీస్​లో పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.

source The Associated Press
T20 Worldcup 2024 (source The Associated Press)

T20 Worldcup 2024 Semifinal : దెబ్బకు దెబ్బ. 2022 టీ20 వరల్డ్ కప్​ సెమీ ఫైనల్​లో తమ జట్టును మట్టికరిపించిన ఇంగ్లాండ్​ టీమ్​పై ప్రతీకారం తీర్చుకుంది టీమ్​ఇండియా. అప్పుడు సెమీ పోరులో ఇంగ్లాండ్‌కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి టీమ్​ఇండియాకు ఘోర పరాజయాన్ని మిగిల్చింది ప్రత్యర్థి​ జట్టు.

Teamindia Final : కానీ ఇప్పుడు మళ్లీ అదే పొట్టి ప్రపంచకప్​ సెమీస్​లో టీమ్​ఇండియాపై చిత్తుగా ఓడింది. ఈ సారి లక్ష్యం 172. అయితే టీమ్​ఇండియా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్​ చేశారు. దీంతో ఇంగ్లాండ్‌ పప్పులుడకలేదు. బట్లర్‌ సేనను కేవలం 103 పరుగులకే కుప్పకూల్చేసి ఫైనల్​కు దూసుకెళ్లారు మనోళ్లు. ఇక టైటిల్ పోరు కోసం శనివారం(జూన్ 29) దక్షిణాఫ్రికాతో తలపడనున్నారు.

మ్యాచ్ సాగిందిలా - అసలు వర్షం వల్ల ఆలస్యంగా మొదలైందీ మ్యాచ్​. అనంతరం మధ్యలోనూ అంతరాయం కలిగించింది. కానీ ఈ పోరులో టీమ్​ఇండియా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి 68 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్​కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఫామ్‌ను కొనసాగించిన రోహిత్‌ శర్మ(39 బంతుల్లో 6×4, 2×6 సాయంతో 57 పరుగులు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 4×4, 2×6 సాయంతో 47 పరుగులు) కూడా మంచి ప్రదర్శన చేశాడు. హార్దిక్‌ పాండ్య (13 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్‌ సాయంతో 23), జడేజా (9 బంతుల్లో 2 ఫోర్లు సాయంతో 17*) పరుగులు చేశారు. విరాట్‌ కోహ్లీ (9), రిషబ్‌ పంత్‌ (4) నిరాశపరిచారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ (3/37), అడిల్‌ రషీద్‌ (1/25), రీస్‌ టాప్లీ (1/25) వికెట్లు తీశారు.

అనంతరం లక్ష్య ఛేదనలో స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌ (3/19), అక్షర్‌ పటేల్‌ (3/23) విజృంభించడం వల్ల ఇంగ్లాండ్‌ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అక్షర్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్‌ ప్లేయర్​ మొయిన్‌ అలీని రిషభ్ పంత్ స్టంపౌట్‌ చేయడం మ్యాచ్​కు హైలైట్‌గా నిలిచిందనే చెప్పాలి.

రోహిత్ 5 వేల పరుగులు - ఇకపోతే ఈ మ్యాచ్​లో 57 పరుగులు చేసిన రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్​లో కెప్టెన్‌గా 5 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఈ మార్క్​ను టచ్​ చేసిన భారత క్రికెటర్లలో రోహిత్‌ ఐదో స్థానం. కోహ్లీ (12883), ధోనీ (11207), అజహరుద్దీన్‌ (8095), గంగూలీ (7643) హిట్​మ్యాన్​ కన్నా ముందున్నారు.

రోహిత్, బట్లర్ కో ఇన్సిడెంట్- సెమీస్​కు ముందు ఇంట్రెస్టింగ్ పాయింట్

అఫ్గాన్ ఇంటికి- దక్షిణాఫ్రికా ఫైనల్​కు - T20 Worldcup 2024 Semifinal

Last Updated : Jun 28, 2024, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.