T20 World Cup 2024 Pakisthan : పాకిస్థాన్ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. అనుకున్నట్టుగానే టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇప్పటివరకు ఊహించని ప్రదర్శనతో దూసుకెళ్లిన పసికూన అమెరికా సూపర్-8కు అర్హత సాధించింది.
గ్రూప్-ఏలో భాగంగా ఫ్లోరిడా వేదికగా అమెరికా, ఐర్లాండ్(America VS Ireland) మధ్య జరగాల్సిన మ్యాచు ఒక్క బంతి కూడా పడకుండానే వర్షం కారణంగా రద్దైంది. దీంతో రెండు టీమ్‌లకు చెరో పాయింట్ ఇచ్చారు నిర్వాహకులు. దీంతో మొత్తం నాలుగు మ్యాచులు ఆడి ఐదు పాయింట్లు దక్కించుకున్న అమెరికా జట్టు మొదటి సారి సూపర్-8 దశకు అర్హత సాధించింది. పాకిస్థాన్ మూడు మ్యాచుల్లో కేవలం ఒక విజయం మాత్రమే అందుకుని రెండు పాయింట్లతో సరిపెట్టుకుంది. ఇక తన చివరి మ్యాచును ఈ నెల 16న ఐర్లాండ్ జట్టుతో తలపడనుంది. ఆ పోరులో పాకిస్థాన్ గెలిచినా తన ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి. అంటే ఐర్లాండ్‌తో జరిగే పోరు పాకిస్థాన్‌కు నామామాత్ర మ్యాచ్‌గానే మిగలనుంది. దీంతో పాక్ ప్రపంచ కప్ నుంచి నిష్క్రమిస్తుంది.
ఇక తొలి సారి సూపర్-8కు దూసుకెళ్లిన అమెరికా జూన్ 19న సౌత్ ఆఫ్రికా, జూన్ 21న విండీస్‌తో తలపడనుంది. జూన్ 23న B1 (ఇంగ్లాండ్/స్కాట్లాండ్) టీమ్‌తో పోటీ పడనుంది. మరోవైపు గ్రూప్-ఏలో ఉన్న టీమ్ ఇండియా(Teamindia Super 8) ఇప్పటికే ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి సూపర్-8కు దూసుకెళ్లింది. శనివారం (జూన్ 15) కెనడా జట్టుతో తలపడనుంది. ఇది నామమాత్ర మ్యాచే. ఇందులో భారత జట్టు గెలిచినా, ఓడినా ఎటువంటి ప్రభావం ఉండదు.
ఇక సూపర్-8 పోరులో టీమ్ ఇండియా ఈ నెల 20న అఫ్గానిస్థాన్‌తో, 22న గ్రూప్ D2 (బంగ్లాదేశ్/నెదర్లాండ్స్) జట్టుతో, 24న ఆస్ట్రేలియాతో పోటీ పడనుంది. సూపర్ - 8కు చేరిన 8 జట్లకు రెండు గ్రూప్‌లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఒక్కో జట్టు తన గ్రూప్‌లోని మూడు జట్లతో తలపడుతుంది. రెండు మ్యాచుల్లో గెలిచిన టీమ్‌కు సెమీస్ చేరే ఛాన్స్ ఉంటుంది.
'టీ20 ఫైనల్లోనూ భారత్- ఆస్ట్రేలియా జట్లే తలపడాలి'! - T20 World cup 2024