T20 WorldCup 2024 Oman VS Namibia : టీ20 వరల్డ్‌కప్-2024లో మ్యాచులు హోరాహోరీగా కొనసాగడం మొదలైపోయింది. మ్యాచులు ఏకపక్షంగా సాగుతాయని అంతా అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ టోర్నీ రసవత్తరంగా పరిగెడుతోంది. టోర్నీ ఆరంభ మ్యాచులో 195 పరుగులను అమెరికా ఛేదించి ఔరా అనిపించింది.రెండో మ్యాచులో ఆతిథ్య వెస్టిండీస్‌కు పాపువా న్యూగినీ దాదాపుగా భయపెట్టేంత పని చేసింది. ఇక తాజాగా బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. ఒమన్ - నమీబియా మధ్య జరిగిన ఈ పోరులో విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా పోరాడారు. దీంతో మ్యాచ్ రిజల్ట్ సూపర్ ఓవర్‌లో తేలింది. ఈ సూపర్ ఓవర్‌లో ఒమన్‌పై నమీబియా విజయం సాధించింది.
ఈ సూపర్ ఓవర్‌లో మొదట నమీబియా బ్యాటింగ్ చేసింది. డేవిడ్ వీస్, ఎరాస్మస్ కలిసి 6 బంతుల్లో 21 పరుగులు చేశారు. అనంతరం 22 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది ఒమన్. 6 బంతుల్లో వికెట్ కోల్పోయి కేవలం 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూపర్ ఓవర్‌లో డేవిస్ వీస్ ఒమన్ బ్యాటర్లకు అవకాశం లేకుండా బంతులు సంధించాడు.
మ్యాచ్ సాగిందిలా - ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ నమీబియా బౌలర్ల దెబ్బకు 19.4 ఓవర్లలోనే కేవలం 109 పరుగులకు ఆలౌట్ అయింది. పేసర్ రూబెన్ ట్రంపెల్మాన్ 4 వికెట్లతో చెలరేగగా ఆల్‌రౌండర్ డేవిస్ వీస్ 3, కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ 2, స్కోల్జ్ 1 వికెట్ తీశారు. ఒమన్ బ్యాటర్లలో ఖలీద్ కైల్(34) పరుగులు, కెప్టెన్ మక్సూద్(22) పరుగులు చేశారు.
ఇక 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా కూడా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 109 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ పోరు సూపర్ ఓవర్‌కు చేరడంలో ఒమన్ ఆల్‌రౌండర్ మెహ్రాన్ ఖాన్ కీలకంగా వ్యవహరించాడు. ఆఖరి ఓవర్‌లో నమీబియా విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఒమన్ బౌలర్ మెహ్రాన్ ఖాన్ అదిరే బౌలింగ్ చేసి తమ జట్టును పోటీలో ఉంచాడు. కానీ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు చేరి అందులో ఒమన్ ఓటమిని అందుకుంది. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన మెహ్రాన్ కేవలం 7 పరుగులు మాత్రమే సమర్ఫించుకుని మూడు వికెట్లు దక్కించుకున్నాడు.
టీమ్ఇండియా మాజీ కోచ్‌తో బరిలోకి పాకిస్థాన్ - ప్రభావం చూపుతుందా? - T20 World Cup 2024
క్యాన్సర్‌ను జయించి - ప్రపంచకప్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికై - T20 WorldCup 2024