T20 worldcup 2024 Bangladesh Super 8 : టీ20 వరల్డ్‌కప్-2024లో గ్రూపు-డి నుంచి బంగ్లాదేశ్ సూపర్-8 బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన గ్రూపు-డి లీగ్ మ్యాచ్‌లో నేపాల్‌పై 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించింది. దీంతో నెదర్లాండ్స్ ఆశలు ఆవిరయ్యాయి. ఆ జట్టు ఆడిన చివరి మ్యాచ్ నామమాత్రంగా మిగిలింది. దీంతో సూపర్ -8కి అర్హత సాధించిన జట్లేవో తేలిపోయాయి.
దెబ్బ కొట్టిన తన్జిమ్ - నేపాల్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 19.3 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. షకిబ్ (17) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లామిచానె, దీపేంద్ర సింగ్, సోంపాల్, రోహిత్ పౌడెల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్ మరింత దారుణంగా ఆడింది. టాప్ ఆర్డర్‌లో ఆసిఫ్ (17) తప్ప అందరూ నిరాశపరిచారు. అయితే, మిడిలార్డర్‌లో కుశాల్ (27), దీపేంద్ర సింగ్ (25) కాస్త జాగ్రత్తగా ఆడి జట్టును గెలిపించేందుకు ప్రయత్నిం చేశారు. కానీ చివరికి 19.2 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది ఆ జట్టు. పైగా నాలుగు వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్ తన్జిమ్ (4/7) దెబ్బకు నేపాల్ కుప్పకూలింది.
బంగ్లా సూపర్ 8 షెడ్యూల్ - ఇకపోతే ఈ మ్యాచ్‌కు ముందే సూపర్ 8కు ఏడు జట్లు అర్హత సాధించాయి. గ్రూప్ ఏ నుంచి టీమ్ ఇండియా, యూఎస్ఏ, గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, గ్రూప్ సి నుంచి వెస్టిండీస్, ఆఫ్గానిస్థాన్, గ్రూప్ డి నుంచి సౌతాఫ్రికా చేరాయి. దీంతో గ్రూప్ డి నుంచి మరో స్థానం కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ పోటీ పడ్డాయి. కానీ చివరికి ఆ బెర్తు బంగ్లాను వరించింది.
ఇప్పుడు సూపర్ 8లో బంగ్లా, టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్థాన్ గ్రూప్ 1లో ఉండనున్నాయి. సూపర్ 8లో భాగంగా బంగ్లాదేశ్ జూన్ 21న ఆస్ట్రేలియాతో, జూన్ 22న టీమ్ఇండియాతో, జూన్ 25న ఆఫ్గానిస్థాన్‌తో పోటీ పడనుంది. సూపర్ 8 జూన్ 19 నుంచి జూన్ 25 వరకు జరగనుంది. ఇందులో నుంచి నాలుగు టీమ్స్ సెమీ ఫైనల్లో అడుగుపెడతాయి.
నామమాత్రపు మ్యాచుల్లో లంక, పాక్ విజయం - ఇక సూపర్-8కు అవకాశం లేని శ్రీలంక, పాకిస్థాన్ మాత్రం తమ చివరి లీగ్ మ్యాచుల్లో గెలిచాయి. నెదర్లాండ్స్‌పై లంక 83 పరుగుల తేడాతో విజయం సాధించగా, ఐర్లాండ్‌పై పాకిస్థాన్ అతికష్టంగా గెలుపొందింది.
ధోనీ వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన కెప్టెన్ బాబర్ - T20 Worldcup 2024
సూపర్-8కు టీమ్ఇండియా రెడీ - గత రికార్డులు ఎలా ఉన్నాయంటే? - T20 World Cup Super 8