T20 Worldcup 2024 Babar azam Beats Dhoni Record : టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ -8కు చేరకుండానే నిష్క్రమించింది దాయాది దేశం పాకిస్థాన్. అయినా ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం ఓ వరల్డ్ రికార్డుతో టోర్నీని ముగించాడు. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టం మీద పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ పోరులో 34 బంతుల్లో 32 పరుగులు చేసిన కెప్టెన్ బాబర్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు.
Most runs in t20 world cup : ఈ క్రమంలోనే ధోనీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో బాబార్ టీ20 ప్రపంచకప్‌లో 17 ఇన్నింగ్స్‌లో 549 పరుగులు చేశాడు. దీంతో ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు మహీ పేరిట ఉంది. అతడు 29 ఇన్నింగ్స్‌లో 529 పరుగులు సాధించాడు. 2016 నుంచి అలానే ఉన్న ఆ రికార్డును ఇప్పుడు బాబర్ అధిగమించాడు. ఇక న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ కూడా 527 పరుగులతో కొనసాగుతున్నాడు. జూన్ 17న పాపువా న్యూ గినియాతో జరగబోయే మ్యాచులో అతడు కూడా మహీ రికార్డ్‌ను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.
టీ20 వరల్డ్ కప్‌లలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు వీళ్లే..
1. కెప్టెన్ బాబర్ - 549 (17 మ్యాచ్‌లు)
2. ధోనీ - 529 (29 మ్యాచ్‌లు)
3. కేన్ విలియమ్సన్ - 527 (19 మ్యాచ్‌లు)
4.మహేల జయవర్ధనే - 360 (11 మ్యాచ్‌లు)
5. గ్రేమ్ స్మిత్ - 352 (16 మ్యాచ్‌లు).
కాగా, ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఐర్లాండ్ మొదట 20 ఓవర్లలో 106/9 స్కోరు చేసింది. గారెత్ డెలానీ(31), జోష్ లిటిల్(22 నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీమ్, షాహీన్ షా తలో 3, మహ్మద్ ఆమిర్ 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత పాకిస్థాన్ 18.5 ఓవర్లలో 111/7 స్కోరు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. చివరి వరకు క్రీజులో ఉన్న కెప్టెన్ బాబర్ ఓ వైపు వికెట్లు పడుతున్నా తాను మాత్రం మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్లు రిజ్వాన్ (17), సైమ్ ఆయుబ్ (17) ఫర్వాలేదనిపించారు. జోష్ లిటిల్ (3/15), క్యాంఫర్ (2/24) వికెట్లు తీశారు. షాహీన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
సూపర్-8కు టీమ్ఇండియా రెడీ - గత రికార్డులు ఎలా ఉన్నాయంటే? - T20 World Cup Super 8
లాస్ట్ స్టేజ్‌లో గ్రూప్ మ్యాచ్‌లు- సూపర్ 8 బెర్త్‌లు ఫిక్స్!