T20 World Cup Squad : ఐపీఎల్ ఫీవర్ త్వరలో ముగియనుంది. దీంతో క్రికెట్ లవర్స్ ఫోకస్ అంతా ఇప్పుడు ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌పై మళ్లుకుంది. జూన్‌లో జరగనున్న ఈ టోర్నీ కోసం ఐసీసీ పెద్ద ఎత్తున సన్నాహకాలు చేస్తోంది. అయితే బీసీసీఐ కూడా తమ తుది జట్టును తయారు చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్ అన్న విషయంపై క్లారిటీ వచ్చింది.
కానీ మిగతా జట్టు సభ్యుల ఎంపిక గురించి ఎటువంటి అప్డేట్ లేదు. దీంతో మాజీలందరూ సోషల్ మీడియా వేదికగా పలు అంచనాలు తెలియజేస్తున్నారు. అయితే ఐపీఎల్ 2024 పర్‌ఫార్మెన్స్, ఫామ్ ఆధారంగా ప్లేయర్‌లను ఎంపిక చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మరి భారత జట్టులో ఎవరికి చోటు దక్కే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం.
- సంజు శాంసన్
తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్. ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ల లిస్టులో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మొత్తంగా 9 మ్యాచ్‌లలో 77 యావరేజ్, 161.08 స్ట్రైక్ రేట్‌తో సంజూ 385 పరుగులు చేశాడు. - కేఎల్ రాహుల్
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ స్టార్ క్రికెటర్ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లలో మూడో వ్యక్తిగా రాణిస్తున్నాడు. స్వతహాగా వికెట్ కీపర్ అయిన ఈ స్టార్ బ్యాటర్ ఆడిన 9 మ్యాచ్‌లలో 42 యావరేజ్, 144.27 స్ట్రైక్ రేట్‌తో 378 పరుగులు చేశాడు. - రిషబ్ పంత్
దిల్లీ జట్టు సారధి రిషబ్ పంత్ తన వింటేజ్ మూవ్స్‌తో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 46.38 యావరేజ్, 160.60 స్ట్రైక్ రేట్‌తో 371 పరుగులు స్కోర్ చేశాడు. అటు కీపింగ్‌లోనూ ఆకట్టుకుంటున్నాడు. చూస్తుంటే ఈ ప్లేయర్‌కు టీమ్ఇండియా టీ20 స్క్వాడ్‌లో చోటు దక్కే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. ఇక ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ లిస్టులో పంత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. - యుజ్వేంద్ర చాహల్
బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగుతున్న సీజన్‌లో పొదుపుగా బౌలింగ్ చేస్తూ, వరుసగా వికెట్లు పడగొడుతున్నాడు యుజ్వేంద్ర చాహల్. రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్‌గా రాణిస్తున్న ఈ స్టార్, తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో టీ20 తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఈ స్టార్ ఆడిన 9 మ్యాచ్‌లలో 13 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. - శివమ్ దూబే
ఐపీఎల్ 2024లో స్థిరంగా పరుగులు చేస్తున్న ఆటగాళ్లలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ శివమ్ దూబే ముందుంటాడు. చెన్నై జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ యంగ్ ప్లేయర్, మొత్తం 8 మ్యాచ్‌లలో, 51.83 యావరేజ్‌తో 169.94 స్ట్రైక్ రేట్‌తో 311 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం.
టీ20ల్లో అత్యధిక ఛేజింగ్‌లు ఇవే - టాప్‌లో ఎవరున్నారంటే? - HIGHEST RUN CHASES