ETV Bharat / sports

న్యూజిలాండ్ వరల్డ్​కప్ స్క్వాడ్ ఔట్- మళ్లీ కేన్ మామే కెప్టెన్​ - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

T20 World Cup New Zealand Squad: 2024 టీ20 వరల్డ్​కప్​కు న్యూజిలాండ్ జట్టును ఆ దేశ బోర్డు ప్రకటించింది.

T20 World Cup New Zealand
T20 World Cup New Zealand
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 9:18 AM IST

Updated : Apr 29, 2024, 10:46 AM IST

T20 World Cup New Zealand Squad: 2024 టీ20 వరల్డ్​కప్​కు కివీస్ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును కివీస్ సోమవారం అనౌన్స్​ చేసింది. ఈ జట్టుకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించనున్నాడు. కాగా, జూన్ 1న పొట్టి ప్రపంచకప్​ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్​కప్​ టోర్నీకి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక పొట్టికప్​కు అన్ని జట్లు సిద్ధమవుతున్నతరుణంలో కివీస్ అందరికంటే ముందుగా టీమ్ ప్రకటించింది.

ఇక ఇవాళ ఇంగ్లాండ్ టీమ్ కూడా ప్రకటించే ఛాన్స్​ ఉంది. మరో రెండ్రోజుల్లో టీమ్ఇండియా స్క్వాడ్ కూడా రానుంది. ఈ టీమ్​కు గ్యారీ స్టెడ్ హెడ్​ కోచ్​ కాగా, లుక్ రాంచీ బ్యాటింగ్, జేకబ్ ఓరమ్ బౌలింగ్ కోచ్​లుగా వ్యవహరించనున్నారు. ఇక వచ్చే నెల 23న పొట్టి ప్రపంచకప్​ కోసం కివీస్ జట్టు వెస్టిండీస్ బయల్దేరనుంది. విండీస్ వేదికగా ఈ టోర్నీలో కివీస్, అఫ్గానిస్థాన్​తో తొలి మ్యాచ్ ఆడనుంది.

అయితే కివీస్ బోర్డు జట్టును ప్రకటించడంలో కాస్త వినూత్నంగా ఆలోచించింది. జట్టు కోచ్, సెలక్షన్ కమిటీ మెంబర్​ కాకుండా ఇద్దరు చిన్నారులచే సభ్యుల పేర్లను అనౌన్స్ చేయించారు. మీడియా ముందుకు వచ్చిన చిన్నారులు ముందుగా వాళ్ల పేర్ల చెప్పి పరిచయం చేసుకున్నారు. తర్వాత ఒక్కొక్కరి పేర్లు అనౌన్స్​ చేసి, ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చేసిన ఈ ప్రయత్నం అందరికీ నచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. దీంతోపాటు కివీస్ వరల్డ్​కప్​లో ధరించే కొత్త జెర్సీని కూడా రివీల్ చేసింది. రెగ్యులర్ బ్లాక్​ కాకుండా కొత్త జెర్సీ డిఫరెంట్​గా ఉంది.

న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సొథి.

కేన్​ మామ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్​ - ఫొటో చూశారా ?

ఎట్టకేలకు గెలిచిన పాక్- 'అష్రఫ్​' రాజీనామాతో జట్టుకు మంచి రోజులు!

Last Updated : Apr 29, 2024, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.