T20 World Cup 2024 Team india : టీ 20 ప్రపంచ కప్ దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జట్లన్నీ తమ ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లను చేసుకుంటున్నాయి. వీరిలో టీమ్ ఇండియా కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో ప్లేయర్స్ అందరూ కలిసి ఒకేసారి వరల్డ్ కప్ వేదికైనా అమెరికా న్యూయార్క్ వెళ్లట్లేదు.
ఐపీఎల్లో ఎలిమినేట్ అయిన జట్లలోని ఆటగాళ్లు మాత్రమే మే 25న వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మిగితా వారు మే 26న ఫైనల్ ఆడి ఆ తర్వాత బయలు దేరనున్నారు. వాస్తవానికి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించని జట్లలోని ప్లేయర్స్ మే 21న న్యూయార్క్ వెళ్లాల్సి ఉంది. కానీ ప్రయాణ షెడ్యూల్లో మార్పులు జరగడం వల్ల మే 25న మొదటి బ్యాచ్ వెళ్తున్నట్లు తెలిసింది.
వీరిలో కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ వంటి కొంతమంది ప్లేయర్స్ సహాయక సిబ్బందితో కలిసి మే 25న బయలుదేరే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ ఫైనల్లో పాల్గొన్న జట్లలోని ఆటగాళ్లు మాత్రం ఇక్కడే ఉండి మే 27న న్యూయార్క్‌కు బయలుదేరుతారు. అలాగే బంగ్లాదేశ్‌తో సన్నాహక మ్యాచ్‌కు ముందు కనీసం మూడు నుంచి నాలుగు నాణ్యమైన నెట్ సెషన్లను జరగనున్నాయి అని పేర్కొన్నాయి.
కాగా, ఈ టోర్నీలో 20 దేశాలు తలపడుతున్నాయి. ఈ 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. యూఎస్ఏ, కెనడా, యుగానా ఈ పొట్టి ప్రపంచకప్‌లో ఆడడం ఇదే మొదటి సారి. జూన్ 2 నుంచి 30 వరకు టోర్నీ జరగనుంది. జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో భారత్ తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. తర్వాత జూన్ 9న పాకిస్థాన్‌తో మ్యాచులో తలపడనుంది.
భారత జట్టు వివరాలు - రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బూమ్రా, మహ్మద్ షమీ, సిరాజ్.
కీలక పోరు - వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే? - IPL 2024 CSK VS RCB
'రెండుసార్లు నా హార్ట్ బ్రేక్ అయ్యింది- కోలుకోడానికి కొన్ని రోజులు పట్టింది' - IPL 2024