T20 World Cup 2024 Rashid Khan : టీ20 వరల్డ్ కప్‌లో ప్రతిసారిలాగే ఈ సారి కూడా ఆఫ్గానిస్థాన్ అండర్ డాగ్‌గా బరిలోకి దిగుతోంది. ప్రపంచకప్‌లో రషీద్ ఖాన్ తొలిసారి తమ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు వహించే అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటికే టీ20వరల్ట్ కప్ ఫార్మాట్‌లో నాలుగు సార్లు ఆడిన రషీద్ తాజా ఇంటర్వ్యూలో అఫ్గానిస్థాన్‌ను గ్రూప్ దశ దాటి తీసుకెళ్లగలమని పేర్కొన్నాడు. అదే గ్రూపులో ఉన్న వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లను తమ మిస్టరీ స్పిన్ బౌలింగ్‌తో కట్టడి చేయగలమని అన్నాడు. గ్రౌండ్స్ ఫ్లాట్‌గా ఉన్నా, అఫ్గానిస్థాన్ మిస్టరీ బౌలర్స్ నైపుణ్యంతో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను ఇరకాటంలో పడేస్తారనే నమ్మకాన్ని కనబరుస్తున్నాడు.
"మాకు సూపర్ 8 స్టేజ్‌కు వెళ్లగలమనే నమ్మకం వెస్టిండీసే ఇచ్చింది. ఇప్పటికే పలు టీ20ల్లో, వన్డేల్లో కూడా ఆ జట్టును దెబ్బతీసాం. మా జట్టులో ఏడెనిమిది మంది ఐపీఎల్‌లో ఆడిన వాళ్లే ఉన్నారు. వరల్డ్ కప్‌కు ముందు అంతకంటే మంచి ప్రిపరేషన్ ఏం కావాలి. నా అంచనా ప్రకారం, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే స్పిన్నర్లకు బాగా అనుకూలించేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ గ్రౌండ్స్ ఫ్లాట్‌గా అనిపిస్తున్నా మా బౌలింగ్ విభాగం, దానిని తిప్పేసుకోగలదు. మా దగ్గర ఉన్న మిస్టరీ స్పిన్నర్లతో కట్టడి చేయగలం, మా బ్యాటర్లతో ఫ్రీగా స్కోరు కూడా నమోదు చేయగలం. నేను (రషీద్), మొహమ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మన్, నూర్ అహ్మద్ ఇప్పటికే కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో చాలా మ్యాచ్‌లకు బౌలింగ్ చేశాం. మాకు అక్కడి మైదానాల పరిస్థితులపై కూడా అవగాహన ఉంది. అది మాకు కలిసొచ్చే అంశం" అని రషీద్ పేర్కొన్నాడు.
క్యాన్సర్‌ను జయించి - ప్రపంచకప్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికై - T20 WorldCup 2024